కడపజిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇవాళ కూడా కొనసాగనుంది.
24.12.2022 షెడ్యూల్
ఉదయం 9 గంటలకు వైఎస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. 9.10 – 9.40 వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. 10.00 – 12.00 ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొంటారు. 12.40 పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. 1.10 – 1.20 విజయ హోమ్స్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 – 1.40 కదిరి రోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. 1.50 – 2.00 కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తారు. 2.05 – 2.20 మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. 2.35 – 2.50 రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. 3.00 – 3.30 డాక్టర్ వైఎస్సార్ బస్‌స్టాండ్‌ను ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 3.35 – 3.55 అహోబిలపురం స్కూలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. 4.05 – 4.20 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. 4.30 – 4.45 జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. తర్వాత సాయంత్రం 5.40 గంటలకు ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
25.12.2022 షెడ్యూల్
ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల చేరుకుంటారు. 9.15 – 10.15 సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొంటారు. 10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 12.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
నేడు విజయనగరం జిల్లాలో బొబిలిలో చంద్రబాబు పర్యటన ...రైతులు తో చంద్రబాబు సమావేశం
నేడు గుంటూరు,విశాఖ రేంజ్ పోలీస్,SEBI పట్టుకున్న గంజాయిని ధ్వంసం చేయనున్న పోలీసులు.హాజరు కానున్న పోలీసు అధికారులు
నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రానున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.
విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో రెండో రోజు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు...
ఈ నెల 26న శ్రీశైలం రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము