వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు జాతీయ స్థాయిలో సిఎస్ ల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హజరు కానున్నారు.
క్యాబినెట్ కార్యదర్శి సమీక్ష....
జనవరి మొదటి వారంలో జరగనున్న 2వ జాతీయ స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి సంబంధించిన వివిధ అంశాలపై ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి డా.పికె.మిశ్రాతో కలిసి వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు జాతీయ స్థాయిలో సీఎస్ ల సమావేశం జరగునున్న నేపథ్యంలో అందుకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించిన వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ అంశాలపై సీఎస్‌లు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్ధం కావాలని రాజీవ్ గౌబ సీఎస్ లకు స్పష్టం చేశారు.  


వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన బెస్ట్ ప్రాక్టీసులను సీఎస్ ల సమావేశంలో జాతీయ స్థాయిలో షేర్ చేసేందుకు వీలుగా సన్నద్ధమై రావాలని చెప్పారు.వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఇన్నోవేటివ్ విధానాలను జాతీయ స్థాయిలో అడాప్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కావున అలాంటి ఇన్నోవేటివ్ విధానాలను సీఎస్ ల సమావేశంలో చర్చించేందుకు వీలుగా సిద్ధం చేసుకొని రావాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్రాల సీఎస్ లకు తెలిపారు. అంతేగాక జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న పలు ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలపై రానున్న సీఎస్ ల సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారన్న క్రమంలో వాటి అమలుపై పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. ప్రధాని మోదీ హజరు కానున్న నేపథ్యంలో రాష్ట్రాల పరిస్థితులపై పూర్తి స్థాయి సమాచారాన్ని రెడీ చేసుకోవాలన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలుపై సైతం సమీక్షించాలన్నారు.
సర్క్యూలర్ ఎకానమీ... పని తీరు బాగుంది..
ఈ వీడియో సమావేశంలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డా.పికె.మిశ్రా మాట్లాడుతూ.. సర్కులర్ ఎకానమీ విషయంలో వివిధ రాష్ట్రాలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్క్రాపింగ్ పాలసీపై ప్రత్యేకంగా అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు కనుక రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ పై రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే నేడు తాగునీటికి ఇబ్బందులున్న క్రమంలో రీసైక్లింగ్ రీయూజ్ పై కూడా దృష్టిపై సారించాలని చెప్పారు. సర్కులర్ ఎకానమీలో వేస్టు టు ఎనర్జీ అనేది ఒక మేజర్ కాంపొనెంట్ అని ఇధనాల్ సర్కులర్ ఎకనామీకి ఉదాహరణగా డా.పికె.మిశ్రా పేర్కొన్నారు. 
దేశంలో ఏటా 62 మిలియన్ టన్నుల వేస్టు జనరేట్ అవుతోందని చెప్పారు. సస్టెయినబుల్ ఆల్టర్నేట్ అపార్డబుల్ ట్రాన్సుపోర్టు విధానానికి కృషి చేయాల్సి ఉందని ఆ దిశగా పెద్దఎత్తున కృషి జరుగుతోందని అన్నారు. ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న, సిడిఎంఏ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ సిహెచ్.హరికిరణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.