Covid 19 New Rules:


ఎయిర్‌ సువిధలో అప్‌లోడ్ చేయాలి..


చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో ఫ్లైట్ ఎక్కే ముందే ఈ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్‌ని Air Suvidha పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయా ట్విటర్ వేదికగా ప్రకటించారు. "చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే వాళ్లు RT PCR టెస్ట్‌లు కచ్చితంగా చేయించుకోవాలి. 2023 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది" అని ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు వచ్చాక ఎయిర్‌పోర్ట్ వద్ద కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలన్న రూల్‌ ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ టెస్ట్ చేశాక పాజిటివ్ వస్తే నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కానీ... ఇప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందే...పోర్టల్‌లో రిపోర్ట్ అప్‌లోడ్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లోనే కాదు. చాలా దేశాలు ఇదే రూల్‌ని ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారు తప్పకుండా నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సిందే. అమెరికా అయితే...చైనా నుంచి వచ్చే వాళ్లు ఒకటి లేదా రెండు రోజుల ముందు మాత్రమే టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్‌ని చూపించాలని కచ్చితంగా చెబుతోంది. మరీ పాత రిపోర్ట్‌లను అంగీకరించడం లేదు. 






విదేశీ ప్రయాణికులకు పాజిటివ్..


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియా ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల్లోనూ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలున్నా...పాజిటివ్‌ అని తేలినా వెంటనే  క్వారంటైన్‌ చేయాలని స్పష్టం చేశారు. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్లు తప్పనిసరిగా Air Suvidh ఫామ్‌లలో ప్రస్తుత ఆరోగ్య స్థితికి సంబంధించిన అన్ని వివరాలు తెలియ జేయాలని కేంద్రం వెల్లడించింది. తమిళనాడు, కేరళ తరవాత బెంగళూరులోనూ కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అబుదాబి, హాంగ్‌కాంగ్, దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్ టెస్ట్ చేయగా...పాజిటివ్‌ వచ్చింది. 
ఈ ముగ్గురి వైరస్ శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపారు. పాజిటివ్‌గా తేలిన వెంటనే ముగ్గురు బాధితులను సమీపంలోని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం కరోనా కట్టడికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా బెంగళూరు, మంగళూరు విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించిన వారిని దగ్గర్లోని ఆసుపత్రుల్లో క్వారంటైన్ చేస్తున్నారు. 


Also Read: Twitter Down: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్