ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,678 శాంపిల్స్ పరీక్షించగా.. 1,217 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,01,255కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం నెల్లూరు (198), తూర్పు గోదావరి (182), చిత్తూరు (171), కృష్ణా (136), ప్రకాశం (113) జిల్లాల్లో నమోదయ్యాయి.  గత 24 గంటల్లో మరో 13 మంది కరోనాతో కన్నుమూశారు.  వీరితో కలిపి రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,715కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1535 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో రికవరీల సంఖ్య 19,72,399కి పెరిగినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.





 తెలంగాణలో 364 కోవిడ్ కేసులు..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 364 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ కేసులకు సంబంధించి శనివారం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. నిన్న మొత్తం 75,289 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,54,758కి చేరింది. గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి మృతుల సంఖ్య 3,856కి పెరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో నిన్న 482 మంది కోలుకున్నారు. దీంతో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 6,44,294కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,608 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Also Read: Zydus Cadila COVID-19 Vaccine: సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి జైకోవ్-డీ టీకా.. ధరెంతంటే?


భారత్‌లో 34,457 కరోనా కేసులు..
భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. గత రెండున్నర నెలలుగా దాదాపుగా ప్రతిరోజూ 30,000 నుంచి 35,000 వరకు కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చితే కరోనా కేసులతో పాటు మరణాలు కాస్త స్వల్పంగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తాజాగా 17,21,205 మందికి కొవిడ్19 పరీక్షలు నిర్వహించగా.. 34,457 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 151 రోజులలో ఇవి కనిష్ట క్రియాశీలక కరోనా కేసులు అని తెలిపింది. 


Also Read: Coronavirus India Live Updates: భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 151 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు


Also Read:  Dengue Fever: ఫీవర్‌ వచ్చినంత మాత్రాన కంగారు పడొద్దు.. ఈ లక్షణాలు ఉంటే మీరు భయపడాల్సిన పనే లేదు..