జైకోవ్-డీ వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి లభించిన వెంటనే టీకాను అందరికీ అందుబాటులోకి తెస్తామని క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ షర్విల్ పంకజ్ భాయ్ పటేల్ తెలిపారు.
గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ.. ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్ టీకా. దీని అత్యవసర వినియోగానికి డీసీజీఐ నిన్న అనుమతించింది.
జైకోవ్-డీ ధరపై వచ్చే వారం ఓ స్పష్టత వస్తుంది. సెప్టెంబర్ నెల మధ్య నుంచి పంపిణీ ప్రారంభం అవుతుంది. కొత్త ఉత్పత్తి కేంద్రంలో అక్టోబర్ నుంచి నెలకు ఒక కోటి డోసులు ఉత్పత్తి చేస్తాం. - షర్విల్ పంకజ్ భాయ్ పటేల్, జైడస్ గ్రూప్ ఎండీ
ఈ కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం 66 శాతం. డెల్టా వేరియంట్ పైన కూడా జైకోవ్-డీ సమర్థంవతంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. 12 ఏళ్ల వయసు దాటిన పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ వేయొచ్చు. ఈ టీకా మొత్తం మూడు డోసులుగా ఇస్తారు. మొదటి డోసు వేసుకున్న 28వ రోజు సెకండ్ డోస్ తర్వాత 56వ రోజు మూడో డోసు వ్యాక్సిన్ ఇస్తారు.
దేశంలో అత్యవసర వినియోగం అనుమతి పొందిన ఆరో కరోనా వ్యాక్సిన్ ఇది. రెండో దేశీయ టీకాగా గుర్తింపు పొందింది. మొదటి దేశీయ టీకా కొవాగ్జిన్.