దేశంలోని ప్రధాన నగరాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ హెటెరోపై దాడులు చేశారు. ఆ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు బెంగళూకు, ముంబై, పుణెల్లోనూ పలు సంస్థలపై వందల మందితో కూడా ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నవి కావు. వేర్వేరుగానే పన్ను ఎగవేత దారులే టార్గెట్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు.
Also Read : ఆర్యన్ కేసులో ఎన్‌సీబీపై తీవ్ర ఆరోపణలు ! సీసీటీవీ ఫుటేజీలో కీలక సాక్ష్యాలు ?
బెంగళూరులోపన్ను ఎగవేత ఆరోపణలపై 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు ఛార్డెట్ అకౌంటెంట్ల నివాసాల్లో లెక్కలు చూస్తున్నారు.
Also Read : పోర్న్ వీడియోలు చూస్తున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు మీ కోసమే!
బెంగళూరులో జరుగుతున్న ఐటీ సోదాల్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప సన్నిహితులను టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితునిగా పేరున్న అమిత్ ఉమేశ్ నివాసంతో పాటు కార్యాలయాలు, బంధువులకు చెందిన ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కర్ణాటక ఇరిగేషన్ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారిపైనే సోదాలు జరుగుతూండటంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కర్ణాటకలో వినిపిస్తోంది.
Also Read : పిల్లల భద్రతపై కేంద్రం కొత్త రూల్స్.. పాటించకపోతే పాఠశాలల పని అంతే!
మరో వైపు మహారాష్ట్రలో ముంబై, పూనె, నాగపూర్‌లలోనూ పెద్ద ఎత్తున ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆఫీసులు, ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారులు అంతా మహారాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ మంత్రితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో రాజకీయంగా ఈ సోదాలు చర్చనీయాంశం అవుతున్నాయి. సోదాలూ పూర్తయిన తర్వాత ఆదాయపు పన్నుశాఖ్ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read : 'కొత్త కొత్తగా ఉందట.. శృంగారంపై భారతీయుల ఆలోచన మారిందట'