ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం ఎంత ఎక్కువగా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యువత, పిల్లలు కూడా ఈ మధ్య పోర్న్ కంటెంట్‌కి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇంటెర్నెట్ అందరికీ అందుబాటులో ఉండటం కూడా ఇందుకు ఓ కారణం. అయితే పోర్నోగ్రఫీ వల్ల బంధాలు దెబ్బతినడమే కాదు చూసే వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఎక్కువగా చూస్తున్నారా?
పోర్న్ కంటెంట్‌ను ఎక్కువగా చూసేవాళ్లు సంసార జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
ఎక్కవ సమయం పాటు పోర్న్ చూసే వాళ్లు సంసార జీవితంలో అసంతృప్తిగా ఉంటున్నారని తేలింది. అంతేకాదు ఇతర పనుల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.
ఎక్కువగా యువతలో ఈ సమస్య అధికంగా ఉంది. చాలా మంది రహస్యంగా పోర్న్ చూస్తుంటారు. వాళ్లు చూడటం ఎవరైనా చూస్తారనే భయంతో ఉంటుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అంతేకాదు పోర్న్‌కు బానిసలుగా మారిన వాళ్లలో శృంగార కోరికలు కూడా తగ్గిపోతాయట.
మరిన్ని సమస్యలు..
పోర్న్ అధికంగా చూసేవాళ్లకు ఆర్థిక, ఉద్యోగ, మానసిక సమస్యలు అధికంగా ఉన్నట్లు ఇటీవల ఓ నివేదికలో తేలింది. అంతేకాదు.. ఈ వీడియోలు ఎక్కువగా చూసి.. అసహజ శృంగారానికి పాల్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల మహిళలను పురుషులు చూసే విధానమే మారిపోతుందని ఈ నివేదికలో పేర్కొన్నారు.
పోర్న్ చూడటాన్ని మద్యం సేవించటాన్ని పోల్చి చెబుతుంటారు. అయితే ఏదైనా శ్రుతి మించకుండా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పోర్న్ ఎక్కువగా చూసేవాళ్లు అత్యాచారాలు, గృహ హింసకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు ఈ నివేదికలో వెల్లడించారు.
రోగాల ముప్పు..
ఎక్కువగా పోర్న్ వీడియోల్లో కండోమ్‌లు వినియోగించరు. ఇది చూసిన వాళ్లు కూడా అలానే చేస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోర్న్ బానిసలుగా మారిన వారు ఎక్కువగా బయటకు కూడా రారని.. సమాజానికి దూరంగా బతుకుతుంటారని పేర్కొంది. మొత్తానికి పోర్న్‌కు మీరు బానిసలైతే చూసే సమయాన్ని నెమ్మదిగా తగ్గించుకుని బంధాలు, సమాజానికి దగ్గరగా బతకడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Samantha Chaitanya Divorce: ''కోట్లలో సంపాదించే సమంతకు పాకెట్‌మనీ మాత్రమే ఇచ్చేవారు..''
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి