Health Warnings on Cigarette Pack: సినిమా థియేటర్లలో, సిగరెట్ ప్యాకెట్లపై 'పొగాకు ఆరోగ్యానికి హానికరం' అంటూ యాడ్స్, వార్నింగ్‌లు చూస్తుంటాం. అయితే ఈ సారి ఈ వార్నింగ్‌ను కాస్త మార్చారు. ఇక నుంచి సిగరెట్, బీడీ, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై కొత్త హెచ్చరిక అమల్లోకి రానుంది.
డిసెంబర్ 1 నుంచి
"పొగాకు బాధాకరమైన చావుకు దారితీస్తుంది" అనే హెచ్చరిక ఇక నుంచి రానుంది. 2022 డిసెంబర్ 1 నుంచి కొత్త హెచ్చరిక అమల్లో ఉంటుంది. ఆ తేదీ నుంచి పొగాకు తయారీ, దిగుమతి, ప్యాకేజీ చేసే వారు తప్పనిసరిగా ఈ హెచ్చరికను ముద్రించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్త హెచ్చరిక ఏడాది పాటు అమల్లో ఉండనుంది.
మరొకటి
ఈ మేరకు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ (ప్యాకేజీ, లేబులింగ్) నిబంధనలు-2008లో సవరణలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
కంటిచూపుపై
ధూమపానం క్యాన్సర్ కారకం అని ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మంది ఇంకా సిగరెట్లు కాలుస్తూనే ఉన్నారు. పొగ తాగడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతుందని అందరికీ తెలిసిందే కానీ ఇప్పడు కంటిచూపు మందగించేలా చేయడం లేదా చూపు పూర్తిగా పోయేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎన్ని లక్షల మందో...
గ్లోబల్ అడల్డ్ టొబాకో సర్వే ఇండియా ప్రకారం మన దేశంలో 267 మిలియన్ల మంది పెద్దలు పొగాకును వినియోగిస్తున్నారు. అనేక పరిశోధనల తరువాత ధూమపానం కంటి చూపును దెబ్బతీస్తుందని బయటపడింది. మాక్యులా క్షీణతకు కారణమవుతుందని తేలింది. మాక్యులా అంటే రెటీనాకు వెనుక భాగంలో ఉండే చిన్న భాగం. ఇది రంగులను గుర్తించేందుకు, ఎదురుగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించేందుకు, కేంద్ర దృష్టికి అవసరం. మాక్యులా ఫోటోరిసెప్టర్ కణాలను కలిగి ఉంటుంది. ఇవి కాంతిని గుర్తించే కణాలు.
మాక్యుమా దెబ్బతింటే చూపు మధ్య భాగంలో మచ్చలా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలు కనిపించినా మధ్య భాగంలో ఏమీ కనిపించకుండా ఇలా నల్ల చుక్కలా కనిపిస్తుంది. ధూమపానం కళ్లకు చికాకును కలిగిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ కు దారి తీస్తుంది. ధూమపానం అధికంగా చేయడం వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ మాక్యుమా దెబ్బతినడం, కంటి శుక్లాలు, గ్లాకోమా వంటివి కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు కంటి వైద్య నిపుణులు.
Also Read: BJP Praveen Nettaru Murder Case: భాజపా యువ నేత హత్య కేసు NIAకు అప్పగించిన సీఎం
Also Read: Uttar Pradesh News: కట్నం ఇవ్వలేదని భార్యపై గ్యాంగ్ రేప్- తర్వాత త్రిపుల్ తలాఖ్!