అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని.. కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా మళ్లీ సమంత, చైతు కలిసిపోవాలని కోరుకుంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే డివోర్స్ విషయం బయటకొచ్చినప్పుడు చాలా మంది సమంతను తప్పుబట్టారు. ఆమె కోట్ల రూపాయల భరణం తీసుకుందని.. ఇలా చాలా పుకార్లు వినిపించాయి.
వీటికి ఇటీవల 'కాఫీ విత్ కరణ్' షోలో క్లారిటీ ఇచ్చింది సమంత. తనపై తప్పుడు ప్రచారం చేశారని.. కానీ అవి తనను ఎంతమాత్రం ఎఫెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. సమంత ఇదివరకు చైతుతో కలిసున్న ఇంటిని భారీ రేటిచ్చి కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ వెల్లడించారు.
మురళీ మోహన్ కి చెందిన ఓ అపార్ట్మెంట్ ని చైతు, సమంత కొనుక్కున్నారు. అందులోనే ఇద్దరూ కలిసి ఉండేవారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు. దీంతో పాత అపార్ట్మెంట్ ను అమ్మేశారు. కానీ కొత్తిల్లు రీమోడలింగ్ చేసేంతవరకు అపార్ట్మెంట్ లోనే ఉంటామని చెప్పడంతో అది కొనుక్కున్నవారు అంగీకరించారు. ఇంతలోనే సమంత, చైతు మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత సమంత ఇంటి కోసం చాలా వెతికిందట.
కానీ ఆమెకి ఎక్కడా నచ్చకపోవడంతో.. చైతుతో కలిసున్న అపార్ట్మెంట్ నే తీసుకోవాలని ఫిక్స్ అయిందట. దీంతో సమంత.. మురళీ మోహన్ దగ్గరకు వెళ్లి ఇల్లు కావాలని అడిగిందట. దానికి ఆయన 'మేము మీకు అమ్మాం.. మీరు ఇంకొకరికి అమ్మారు కదా.. ఇప్పుడేం చేయగలనమ్మా..?' అని అన్నారట. దీంతో సమంత ఆ అపార్ట్మెంట్ ఎవరైతే కొన్నారో వారితో మాట్లాడి.. ఇంకా ఎక్కువ డబ్బిచ్చి మరీ ఆ ఇంటిని సొంత చేసుకుందట. ప్రస్తుతం సమంత తన తల్లితో కలిసి ఆ అపార్ట్మెంట్ లోనే ఉంటోందని చెప్పుకొచ్చారు మురళీమోహన్.