సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'చంద్రముఖి' సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2005లో విడుదలైన ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని చాలా రోజులుగా ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్లే 'చంద్రముఖి2' సినిమా తాను చేయబోతున్నట్లు రెండేళ్ల క్రితం అనౌన్స్ చేశారు రాఘవ లారెన్స్.


 ఆ తరువాత మళ్లీ చాలా కాలం వరకు అప్డేట్ లేదు. రీసెంట్ గా రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలోనే ఈ సినిమాను తెరకెక్కనుందని ప్రకటించారు. ప్రముఖ నిర్మాత సంస్థ లైకా.. 'చంద్రముఖి2'ని నిర్మించబోతోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఐదుగురు హీరోయిన్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వారెవరంటే.. లక్ష్మి మీనన్, మంజిమా మోహన్, మహిమా నంబియార్, సృష్టి దాంగే, సుభిక్ష కృష్ణన్ లు. 


అయితే ఈ ఐదుగురిలో చంద్రముఖి ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి ఈ సినిమాలో దెయ్యాలతో పాటు గ్లామర్ షోని కూడా చూపించబోతున్నారు.  రీసెంట్ గా మైసూర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఏ విషయంలో రాజీ పడకుండా సినిమాను రూపొందిస్తున్నారు. 'చంద్రముఖి' సినిమాలో నటించిన కమెడియన్ వడివేలు పార్ట్ 2లో కూడా కనిపించబోతున్నారు. ఇక లారెన్స్, పి.వాసు కాంబినేషన్ అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయనున్నారు.


Also Read : రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రెడీ!


Also Read : 'F3'లో ఓవర్ యాక్షన్ చేశారు, 'అంటే సుందరానికీ' సాగదీశారు - తమ్మారెడ్డి కామెంట్స్