తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులు (Tollywood Top Star Heros Remuneration 2022) ఒక్కొక్క సినిమాకు ఎన్నేసి కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నారు? ఎంత డిమాండ్ చేస్తున్నారు? - అంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. తీసుకుంటున్న హీరోలకు, ఇస్తున్న నిర్మాతలకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే... యంగ్ స్టార్ హీరోస్ ఒక్కో సినిమాకు మినిమమ్ రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది వాస్తవం. ఇప్పుడు అదీ టాపిక్ అవుతోంది.
తెలుగులో పరాజయాల శాతంతో పాటు నిర్మాణ వ్యయం భారీ పెరగడంతో పరిశ్రమ మనుగడ కోసం నిర్మాతలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. థియేటర్లలో విడుదల అయిన పది వారాల తర్వాత పెద్ద సినిమాలు ఓటీటీలకు ఇవ్వడంతో పాటు టికెట్ ధరలు వంటి వాటిపై చర్చలు జరుగుతున్నాయి. హీరోలను కలిసి రెమ్యూనరేషన్ తగ్గించుకోమని రిక్వెస్ట్ చేయాలనుకోవడం కూడా నిర్మాతల చర్చల్లో వచ్చిన అంశం.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు హీరోలతో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు చర్చలు జరిపారు. ఆయనతో తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటామని ముగ్గురు హీరోలు చెప్పారట.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు. 'థాంక్యూ' విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన 'దిల్' రాజు... ''నిర్మాతల సమావేశం గురించి రామ్ చరణ్ అడిగారు. నిర్మాతలకు అండగా ఉండటానికి రెడీ అన్నారు. ఇండస్ట్రీ మంచి కోసం తమ వంతు కృషి చేయడానికి హీరోలు రెడీగా ఉన్నారు'' అని చెప్పారు. రామ్ చరణ్ సహా మిగతా ఇద్దరు స్టార్ హీరోలతో ఆయన సాగించిన చర్చలు ఫలించాయని చెప్పాలి.
Also Read : 'F3'లో ఓవర్ యాక్షన్ చేశారు, 'అంటే సుందరానికీ' సాగదీశారు - తమ్మారెడ్డి కామెంట్స్
హీరోలతో పాటు హీరోయిన్లు, స్టార్ స్టేటస్ అందుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపై అసిస్టెంట్స్ ఖర్చులు నిర్మాత అకౌంట్‌లో వేసే అవకాశాలు లేవని చెప్పాలి.
Also Read : నేను వైఎస్సార్ అభిమానినే కానీ కమ్మ, కాపులను తిట్టలేదు - నితిన్ దర్శకుడు