హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఆ హీరో హీరోయిన్లు ఇద్దరూ ప్రేమలో ఉన్నారట! ఆ హీరోకి బ్రేకప్ చెప్పేసిన హీరోయిన్ మరో హీరోతో ప్రేమలో పడిందట! వంటి కబుర్లు వింటుంటాం! తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆ తరహా ఎఫైర్లు వినడం చాలా తక్కువ అని చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయానికి వస్తే అటువంటి కబుర్లు అందనంత దూరం! అది మొన్నటి వరకు... ఈ మధ్య హిందీ హీరో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి ఇటు మీడియాలను అటు ప్రజల్లోనూ భారీ ఎత్తున చర్చ జరిగింది.


నరేష్, పవిత్రా లోకేష్ మధ్య సంబంధం ఉందంటూ నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు చేశారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. పవిత్రా లోకేష్ భర్త సైతం ఆమెపై ఆరోపణలు చేయడంతో వాతావరణం వేడెక్కింది. ఈ ప్రచారాన్ని నరేష్ కొట్టి పారేశారు. పవిత్ర లోకేష్ తనకు మంచి స్నేహితురాలు అని చెప్పుకొచ్చారు. మరోవైపు న‌రేష్‌కు, మద్దతు ఇవ్వాలని పవిత్రా లోకేష్ కోరడం చర్చనీయాంశం అయింది.


నరేష్, పవిత్రా లోకేష్ మధ్య రియల్ లైఫ్ రిలేషన్ స్టేటస్ ఏంటి? అనేది పక్కన పెడితే... రీల్ లైఫ్ లో, అంటే సినిమాల్లో జంటగా నటించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కనిపించారు. బహుశా... వీళ్ళిద్దరి రియల్ లైఫ్ రిలేషన్ స్టేటస్ గురించి ప్రేక్షకులు ఆసక్తి కనపరచడానికి కారణం ఆ రీల్ లైఫ్ కెమిస్ట్రీ కూడా కారణం అయ్యుండొచ్చు. పాత్రలకు న్యాయం చేయడం నటీనటులుగా వాళ్ళ బాధ్యత. దాన్ని ఆధారం చేసుకుని వాళ్ల మధ్య ఏదో ఉందని చెప్పడం సబబు కాదు. బట్, ఫర్ ఎ చేంజ్... వాళ్లు ఇద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే? బ్రదర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తే?


మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ఈరోజు థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో నరేష్, పవిత్రా లోకేష్ నటించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఇద్దరూ జంటగా నటించలేదు. హీరోయిన్ దివ్యాంశ కౌశిక తండ్రిగా నరేష్ కనిపిస్తే... హీరో రవితేజ తల్లి పాత్రలో పవిత్రా లోకేష్ కనిపించారు. స్క్రీన్ మీద రెండు క్యారెక్టర్స్ మధ్య రిలేషన్ రివీల్ అయినప్పుడు ప్రసాద్ ఐమాక్స్ లో ప్రేక్షకులు కొందరు విజిల్స్ వేయడం, గోల గోల చేయడం చూస్తే... నరేష్ - పవిత్ర జోడీ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 


Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?


ఇటీవల 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలోని ఒక స్కిట్ లో నరేష్, పవిత్ర పేర్లతో కామెడీ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఒక్కటి మాత్రం నిజం... ఇప్పుడు ఈ జోడీ హాట్ గురూ!


Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?