China Taiwan Dispute: చైనా, తైవాన్. ఇదో ఎడతెగని పంచాయితీ. తైవాన్‌ని పూర్తిగా (China Taiwan Tensions) ఆక్రమించేందుకు, ఆ దేశంపై ఆధిపత్యం చూపించేందుకు చైనా పదేపదే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడూ అదే చేస్తోంది. ఈసారి ఏకంగా మిలిటరీ డ్రిల్స్‌తో ఆ దేశాన్ని భయపెట్టే పనిలో పడింది. రెండు రోజులుగా అక్కడ ఈ యుద్ధ విన్యాసాలు (China's Robot Dogs) కొనసాగుతూనే ఉన్నాయి. మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు భారీ ఓడలు కూడా రంగంలోకి దిగాయి. ఈ మధ్యే తైవాన్‌కి కొత్త అధ్యక్షుడిగా Lai Ching-te ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రసంగంపై చైనా తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. తమది స్వతంత్ర దేశం అనే భ్రమంలో ఉన్నారని మండి పడింది. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం అలా ముగిసిందో లేదో వెంటనే చైనా మిలిటరీ డ్రిల్స్ మొదలు పెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తితో పాటు ఉత్కంఠ కలిగించే విషయం ఒకటి ఉంది. అదేంటంటే...చైనా రోబో డాగ్స్‌ని (Robot Dogs in China Army) తయారు చేసుకోవడం. పైగా సోషల్ మీడియాలో ఈ రోబో డాగ్స్‌ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. చైనా సైనికులతో సమానంగా అవి వేగంగా నడుస్తున్నాయి. చైనా, కంబోడియా సంయుక్తంగా నిర్వహించిన మిలిటరీ విన్యాసాల్లో వీటిని ప్రదర్శించింది చైనా. వీటిని చాలా పకడ్బందీగా తయారు చేసుకుంది డ్రాగన్ దేశం. వాటికి మెషీన్ గన్‌లు అమర్చింది. ఇప్పుడు వీటిని తైవాన్‌పైకి ప్రయోగిస్తుందా అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. 






స్పెషాల్టీ ఇదే..


ఈ రోబో డాగ్స్ నాలుగు గంటల పాటు నిర్విరామంగా పని చేయగలవు. 20 కిలోల బరువున్న మెషీన్‌ గన్స్‌ని మోస్తూనే ముందుకు వేగంగా దూసుకుపోతాయి. అంతే కాదు. రకరకాల విన్యాసాలూ చేస్తాయి. ముఖ్యంగా దట్టమైన అడవుల్లోనూ ఎలాంటి దారిలోనైనా సరే లక్ష్యాన్ని ఛేదించేస్తాయి. తక్కువ ధరకే వీటిని తయారు చేయాలనీ (Robot Dogs in US) ప్లాన్ చేసుకుంటోంది చైనా. ఇకపై పూర్తి స్థాయిలో వీటిని వినియోగించాలని భావిస్తోంది. అయితే...ఈ రోబో డాగ్స్‌ని యుద్ధాల్లో వినియోగించడం సమంజసమా కాదా అన్న చర్చ ఓ వైపు జరుగుతూనే ఉంది. ఇప్పటికే అమెరికాలోనూ ఇదే తరహా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోడంలో భాగంగా రోబో శునకాల్ని అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో ఉంది అగ్రరాజ్యం. కొన్ని రోబోటిక్ కంపెనీలు మాత్రం తాము తయారు చేసిన రోబోలను ఇలా కస్టమైజ్‌ చేసుకుని ఆయుధాలుగా మలుచుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. రోబోలకు ఆయుధాలు తగిలించి వాటిని యుద్ధంలోకి దింపడం నేరం అని వాదిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్‌ అంటే ఇలా వాటిని ఆయుధాలుగా మార్చడం కాదని తేల్చి చెబుతున్నాయి. 


Also Read: Ebrahim Raisi Death: ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మృతిపై తొలి రిపోర్ట్‌, అందులో ఏముందంటే?