తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్‌ కూడా కరోనా బారిన పడ్డారు. ఇద్దరూ ఒకరోజు తేడాతో కరోనా పాజిటివ్ అని తేలిందని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఇద్దరూ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య చికిత్సను తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ బారిన పడ్డ చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు చేశారు.


ఆ మరుసటి రోజే- చంద్రబాబు నాయుడు కూడా మహమ్మారి బారిన పడ్డారు. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు కూడా కోవిడ్ సోకింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ బారిన పడ్డ చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు చేశారు.


చంద్రబాబుకు కరోనా రావడం పట్ల తాజాగా భారత్‌లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు తనకు తెలిసిందని లేఖలో అన్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ లేఖను తెలుగు దేశం పార్టీ నాయకులు తమ అధికారిక సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేశారు.


ట్వీట్ చేసిన జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం జగన్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి చంద్రబాబు వేగంగా రికవరీ కావాలని కోరారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వైఎస్ జగన్ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు చంద్రబాబును కూడా ట్యాగ్ చేశారు.


Also Read: TS High Court: తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఫైర్, మార్చి 14 వరకూ డెడ్ లైన్.. లేదంటే..


Also Read: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులపై కేసు ? విచారణకు రావాలని విజయవాడ పోలీసుల నోటీసులు !


Also Read: ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయి... జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి