ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ లో గంజాయి విక్రయం కొత్త విషయం కాదని, ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి చెందారు. ఈ దాడికి కారణమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్(IED) తయారీకి వాడిన రసాయనాలను అమెజాన్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. 


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


పుల్వామా దాడి కేసు దర్యాప్తు చేసిన NIA మార్చి 2020లో ఇచ్చిన తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిందని పేర్కొంది. మార్చి 2020లో ఈ విషయంపై మీడియాలో కూడా విస్తృతంగా కథనాలు వచ్చాయని తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా ఇతర వస్తువులతో పాటు, భారతదేశంలో నిషిద్ధ వస్తువైన అమ్మోనియం నైట్రేట్ కూడా కొనుగోలు ఉగ్రవాదులు కొనుగోలు చేశారని తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని సీఏఐటీ తెలిపింది. 


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


పబ్లిక్ డొమైన్‌లో లభ్యమైన ఎన్‌ఐఏ ప్రాథమిక విచారణ నివేదికల ప్రకారం పుల్వామా ఉగ్రదాడి కేసులో అరెస్టైన వ్యక్తి అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ఖాతాను ఉపయోగించి ఐఈడీలు, బ్యాటరీలు, ఇతర వస్తువులు తయారీకి రసాయనాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బిసి భారతియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాలు అమ్మోనియం నైట్రేట్, నైట్రోగ్లిజరిన్ మొదలైనవాటిని ఫోరెన్సిక్ ప్రోబ్ ద్వారా నిర్ధారించారని పేర్కొన్నారు. సైనికులపై దాడికి ఉపయోగించిన నిషిద్ధ అమ్మోనియం నైట్రేట్ అమ్మిన అమెజాన్ సంస్థ అధికారులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని CAIT పేర్కొంది. కానీ ఈ నిర్ణయం పాలసీ రూపకర్తలపై వైఖరిపై అనుమతించే విధాన రూపకర్తలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కామర్స్ పోర్టల్‌లు తమకు నచ్చినవి అమ్ముకునేట్లు ఈ విధానాలు ఉన్నాయని CAIT తెలిపింది. 


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


ఈ సంచలనాత్మక విషయం ఎలా కనుమరుగు అయిపోయిందో చాలా ఆశ్చర్యంగా ఉందని, నిషిద్ధ వస్తువుల అమ్మకాలపై తదుపరి చర్యలు తీసుకోలేదని సీఏఐటీ ప్రకటనలో పేర్కొంది. 2011లో అమ్మోనియం నైట్రేట్ నిషేధిత వస్తువుగా భారత ప్రభుత్వం ప్రకటించిందని, దీని కోసం పేలుడు పదార్థాల చట్టం, 1884 ప్రకారం అమ్మోనియం నైట్రేట్‌ ను ప్రమాదకరమైన గ్రేడ్‌ల జాబితా చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతదేశంలో దీని బహిరంగ విక్రయం, కొనుగోలు, తయారీని నిషేధిస్తున్నట్లు భార్టియా, ఖండేల్వాల్ తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో పేలుళ్లను ప్రేరేపించడానికి ఉపయోగించే బాంబులలో అమ్మోనియం నైట్రేట్ ను పేలుడు పదార్థంగా వాడుతున్నట్లు తెలిపారు. ముంబయి బాంబు పేలుళ్లకు ముందు 2006లో వారణాసి, మాలేగావ్ పేలుళ్లలో, 2008 ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో అమ్మోనియం నైట్రేట్ ను ఉగ్రవాదులు ఉపయోగించినట్లు సీఏఐటీ అధికారులు తెలిపారు. 


Also Read: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


CAIT 2016 నుంచి ఈ-కామర్స్ చట్ట నిబంధనలను క్రోడీకరించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు పాలకులు ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్కొంది. బాంబుల తయారీకి ఉపయోగించే రసాయనాలు అందించడం కంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదని సీఏఐటీ ప్రతినిధులు అంటున్నారు. ఈ కేసును మళ్లీ విచారణ జరిగి అమెజాన్ సంస్థపై చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేయాలని CAIT ప్రకటనలో తెలిపింది. అమ్మోనియం నైట్రేట్ అనేది క్రిస్టల్ లాంటి తెల్లటి ఘనపదార్థం. దీనిని ముఖ్యంగా ఎరువులలో నత్రజని మూలంగా వాడతారు. దీంతో పాటు మైనింగ్ కోసం పేలుడు పదార్థాలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్ పేలినప్పుడు, నైట్రోజన్ ఆక్సైడ్స్, అమ్మోనియా వాయువుతో సహా విషపూరిత వాయువులను విడుదల చేస్తుంది. దీని వల్ల తీవ్ర ప్రభావాలు ఉంటాయని సీఏఐటీ ప్రతినిధులు అంటున్నారు. 


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే జోక్యం చేసుకోవాలని భారతియా, ఖండేల్వాల్‌లు కోరారు. ఎఫ్‌డీఐ పాలసీలోని ప్రెస్ నోట్ నంబర్ 2 స్థానంలో ఇ-కామర్స్ రూల్స్, ఇ-కామర్స్ పాలసీ, కొత్త ప్రెస్ నోట్‌ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. ఈ-కామర్స్ పోర్టల్‌లలో నిషేధిత వస్తువుల అమ్మకాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించకూడదని, పెద్ద ఈ-కామర్స్ వ్యాపార విధానాలపై దర్యాప్తు చేయాలని CAIT కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విక్రేయించే వాళ్ల KYC విధానాన్ని తప్పనిసరి చేయాలని కోరింది. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి