ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయి ఉండొచ్చు- కవితను ఉద్దేశించి కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ సందడి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్నత స్థానంలో ఉన్న వారి వరకు అంతా ఉత్సాహంగా రాఖీ పండగను జరుపుకుంటున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మహిళలంతా వెళ్లి రాఖీలు కడుతున్నారు. వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజకీయల నాయకులకే కాకుండా పోలీసులు, ఖైదీలు ఇలా అందరికీ పలువురు రాఖీలు కడుతున్నారు. రాఖీ సందర్భంగా ప్రధానమంత్రికి విద్యార్థులు రాఖీలు కట్టారు. వారితో మోదీ కాసేపు ముచ్చటించారు. మహిళా నేతలు కూడా ఆయనకు రాఖీలు కట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అనకాపల్లిలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఇంకొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర దగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథశ్రమంలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం సమోసా తిన్న విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ రాజకీయాల్లో సంచలనం- ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం మాక్‌ పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు దాటినా ఇంకా రిజల్ట్స్‌పై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఇలాంటి స్టోరీలను షేర్ చేస్తుంటే... ఆ పార్టీని సపోర్ట్ చేసే మీడియాలో ఇలాంటి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్న వ్యవహారం మరో ఎత్తు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు స్థానం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన ఫలితాలపై అనుమానపడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
రుణమాఫీ... తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఆగస్టు 15లోగా 2లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి... ఆగస్టు  15లోగా మూడు విడతల్లో రుణమాఫీ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ... చాలా మంది రైతులకు రుణమాఫీ అందలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో... ప్రభుత్వం విమర్శలు ఎక్కుపెట్టింది ప్రతిపక్షం. రుణమాఫీని... తూతూ  మంత్రంగానే చేశారని విరుచుకుపడుతోంది. ఇది... ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


శ్రీసిటీలో ఒకేరోజు 15 పరిశ్రమలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు వెళుతున్నారు. ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి