Raksha Bandhan Celebrations In Andhra Pradesh Telangana: తెలుగు రాష్ట్రాల్లో రాఖీ సందడి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్నత స్థానంలో ఉన్న వారి వరకు అంతా ఉత్సాహంగా రాఖీ పండగను జరుపుకుంటున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మహిళలంతా వెళ్లి రాఖీలు కడుతున్నారు. వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజకీయల నాయకులకే కాకుండా పోలీసులు, ఖైదీలు ఇలా అందరికీ పలువురు రాఖీలు కడుతున్నారు. 


రాఖీ సందర్భంగా ప్రధానమంత్రికి విద్యార్థులు రాఖీలు కట్టారు. వారితో మోదీ కాసేపు ముచ్చటించారు. మహిళా నేతలు కూడా ఆయనకు రాఖీలు కట్టారు. 






తెలుగింటి ఆడపడుచులందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. మొదటి నుంచి టీడీపీ ఆడపడుచుల పక్షపాతి అని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను వారి పేరుపైనే ఇచ్చే సంస్కరణ తెచ్చిందిని వెల్లడించారు.  మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. రాఖీ సందర్భంగా చాలా మంత్రులు, పలువురు మహిళా ఎమ్మెల్యేలు, మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు చంద్రబాబుకు రాఖీ కట్టారు. 




తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత రాఖీలు కట్టారు. దీనిపై ట్వీట్ చేసిన రేవంత్‌రెడ్డి... ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతోపాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు. 




మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోషల్ మీడియాలో ఎమోషనర్ పోస్టు పెట్టారు. రాఖీ సందర్భంగా తన సోదరి కవితను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం జైలు ఉండి రాఖీ కట్టలేకపోయినా ఆమెకు అండగా ఉంటామని చెప్పారు. 




కేటీఆర్‌ ఏమన్నారంటే..."ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ కష్టసుఖాల్లో నీకు నేను తోడుగా ఉంటాను" అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టైన కవిత ఐదు నెలలుగా జైలులో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుకున్న ఆమె బెయిల్ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు.