Brahmamudi Serial Today Episode: ఆఫీసును ఎవరూ పట్టించుకోకపోతే తరతరాలుగా మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని సీతారామయ్యకు చెప్తుంది కావ్య.  క‌ళ్యాణ్ వ‌చ్చే లోపు కంపెనీ ప‌రిస్థితి ఏమ‌వుతుందోన‌ని కంగారు ప‌డుతుంది. దీంతో కావ్య చెప్పింది కూడా నిజమే కదా బావ అంటుంది ఇందిరాదేవి. అప్పటివరకు కంపెనీ ఎవరు చూసుకుంటారు అంటుంది ఇందిరాదేవి. అయితే తన నా కొడుకులు  ఉన్నారుగా అని  సీతారామయ్య అంటే ఇంతలో రుద్రాణి నా కొడుకు ఉన్నాడు కదా అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.


కావ్య: ఇదీ అసలు విషయం... చిన్నత్తయ్యకు కీ ఇచ్చి పెద్దింటి తాళాలు తెరవాలని అనుకుటుంది రుద్రాణి గారు. నీ కొడుక్కి ఆఫీస్ విషయాలకంటే వేరే వాటి మీదే ద్యాస ఎక్కువ.


రుద్రాణి: ఇది నీ అసలు స్వరూపం. నీ భర్తకు మాత్రమే అధికారం ఉండాలనేది నీ కోరిక.


అపర్ణ: రుద్రాణి ఇంకోసారి నా కొడుకు కోడలిని అంటే నీకు నిలవనీడ లేకుండా చేస్తాను.


రుద్రాణి: ఇవన్నీ వద్దు కానీ.. రాహుల్‌ను నియమించండి నాన్న


సీతారామయ్య: సరే చూద్దాం. నీ కొడుకు సామర్థ్యం ఏంటో బయటపడుతుంది కదా.


 అని సీతారామయ్య చెప్పగానే రుద్రాణి, రాహుల్‌ ఇద్దరు ఎగిరిగంతేసినంత పని చేస్తారు. ఇందిరాదేవి మాత్రం ధాన్యలక్ష్మీని తిడుతుంది. నీ కొడుకు కోసం కన్నకొడుకులా చూసుకున్న రాజ్‌ను తప్పిస్తావా? అంటూ కోప్పడుతుంది. మరోవైపు తన బుక్‌  పబ్లిష్‌ చేసిన ఆఫీసుకు వెళ్లి అక్కడే ఏదైనా జాబ్‌  ఉందోమోనని కనుక్కుంటాడు కళ్యాణ్‌. కానీ తాము ఇప్పుడు కవితలు అచ్చు వేయడం లేదని కథలు రాస్తే అచ్చు వేస్తామని చెప్పి ఇంతకుముందు మీ కవితలు పబ్లిష్‌ అయినందుకు మీకు పేమెంట్‌  ఇవ్వలేదని ఇప్పుడు తీసుకోండని కళ్యాణ్‌కు 6 వేల రూపాయలు ఇస్తారు పబ్లిషర్స్‌. ఆ పేమెంట్‌   తీసుకున్న కల్యాణ్ ఎమోషనల్ అవుతాడు.


కళ్యాణ్‌: ఎలాంటి సమయంలో మీరు నాకు సాయం చేస్తున్నారో మీకు తెలియదు. ఇది ఇప్పుడు నాకు చాలా అవసరం సార్. థ్యాంక్యూ


పబ్లిషర్స్‌:  మీలాంటి వాళ్లు యంగ్‌స్టర్స్ మాకు చాలా అవసరం. ఓ మంచి కథ రాసుకోండి. నచ్చితే కచ్చితంగా పబ్లిష్ చేస్తాం.


అని చెప్పగానే కళ్యాణ్‌ తప్పకుండా మంచి కథతో మీ దగ్గరకు వస్తాను  అంటాడు. మరోవైపు సీతారామయ్య దగ్గరికి ఇందిరాదేవి వెళ్తుంది. ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నావా. మాటిచ్చి తప్పు చేశానని ఆలోచిస్తున్నావా  అని అడుగుతుంది. తాను  అలా చేయకపోతే ధాన్యలక్ష్మీ ఆస్తులు పంచే వరకు వదిలేది కాదని సీతారామయ్య చెప్తాడు. నేను బతికున్నంత కాలం ఈ కుటుంబం కలిసే ఉండాలని చెప్తాడు. సీతారామయ్య. మరోవైపు రాజ్‌, కావ్య గొడవపడుతుంటారు.


కావ్య: తాతయ్య అంటే ఇల్లు ముక్కలు అవ్వడం ఇష్టం లేక ఇలా చేశారు. కానీ మీకు తెలియదా.. కవిగారు వచ్చే వారే అయితే మీరు కాల్ చేసిన రోజే వచ్చేవారని.


రాజ్‌: అసలు ఇదంతా నీకెందుకు?


కావ్య: ఎందుకు అంటారేంటి? నేనేమైనా మీ కంపెనీలో జీతం తీసుకునే ఉద్యోగినా..?  నేను మీ భార్యను. అడిగే హక్కు నాకుంది.


రాజ్: ఇంటి గౌరవం కాపాడే హక్కు, అర్హత అధికారం నాకుంది. కుటుంబం ముక్కలు కాకుండా చూసుకునే బాధ్యత నామీద ఉంది.


 అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటారు. కావ్య రాజ్‌తో చాలెంజ్‌ చేసి వెళ్లిపోతుంది. మరోవైపు ఇంటికి వచ్చిన కళ్యాణ్‌ను ఉద్యోగం దొరికిందా అని అప్పు అడుగుతుంది. ఉద్యోగం దొరకలేదు కానీ జీతం దొరికిందని పబ్లిషర్స్‌ ఆఫీసులో జరిగిన విషయం మొత్తం చెప్తాడు కళ్యాణ్‌. దీంతో అప్పు కొత్తగా కథ వెతుక్కోవడం దేనికి మీ ఇంట్లో జరుగుతున్న దాన్నే కథగా రాయి అని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.