Mpox Virus Review: కరోనా కాటు నుంచి బయటపడ్డామో లేదో... మరో వైరస్‌ దాపరించింది. మంకీఫాక్స్‌ రూపంలో... ముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచం మొత్తాన్ని మరోసారి టెన్షన్‌ పెడుతోంది. మంకీఫాక్స్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రెండు రోజుల క్రితం హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. మన దేశంలో ఇప్పటి వరకు మంకీఫాక్స్‌ కేసులు నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. అయినా... అప్రమత్తంగా  ఉండటం అవసరం. అందుకే... ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్‌ పి.కె.మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మంకీఫాక్స్‌ నివారణపై చర్చించారు. కొత్త వైరస్‌ను  ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిఘా పెంచాలని... వ్యాధి వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. వైరస్‌ నిర్ధారణ కోసం రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు పెంచాలన్నారు పి.కె.మిశ్రా. ప్రస్తుతం 32 ల్యాబ్‌లను  టెస్టుల కోసం సిద్ధంగా ఉన్నాయి.. మరిన్ని ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని... తీసుకోవాల్సి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున కార్యక్రమాలు  రూపొందించాలన్నారు. వ్యాధి లక్షణాల ఎలా ఉంటాయనేది కూడా... ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 


ఇప్పటి వరకు నమోదైన మంకీఫాక్స్‌ కేసులు.. మరణాలు...
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం... 2022 నుంచి ఇప్పటి వరకు 116 దేశాలలో మొత్తం 99,176 మంకీఫాక్స్‌ కేసులు నమోదయ్యాయి. 208 మంది ఈ వైరస్‌ కారణంగా మరణించారని ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.కె. మిశ్రా చెప్పారు.  డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. గత ఏడాదిదితో పోలిస్తే... ఈ ఏడాది కేసుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది... ఇప్పటి వరకు 15,600కిపైగా కేసులు నమోదవగా... 537 మంది  మరణించినట్టు చెప్పారు. 


ప్రధాని మోడీ కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ పి.కె.మిశ్రా. ఈ సమీక్షా సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ఆరోగ్య  పరిశోధన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహల్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్య కార్యదర్శి కృష్ణ ఎస్. వాట్స్, సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, హోంశాఖ కార్యదర్శి గోవింద్, ఇతర మంత్రిత్వశాఖల అధికారులు కూడా  పాల్గొన్నారు. శనివారం (ఈనెల 17న) కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. మంకీఫాక్స్‌ వ్యాప్తి, అడ్డుకునేందుకు దేశంలో ఉన్న ఏర్పాట్లపై సమీక్షించారు. 


మంకీఫాక్స్‌ లక్షణాలు.. నివారణ మార్గాలు...
ఎంఫాక్స్‌.. దీన్నే మంకీఫాక్స్‌ అంటారు. ఇది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌.. అంటే అంటువ్యాధి. 1958లో కోతుల్లో ఈ వ్యాధి వ్యాపించిందని గుర్తించారు. జంతువులతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులకు మంకీఫాక్స్‌ వైరస్‌ సోకినట్టు కనుగొన్నారు. ఈ వైరస్‌  సోకిన వారికి.. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట ఉంటాయి. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లులా గాయాలు ఏర్పడి... చీము పట్టి బాధిస్తాయి. మంకీఫాక్స్‌ బాధితులకు.. మశూచికి వాడే వ్యాక్సినే ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ బాగా పనిచేస్తున్నట్టు వైద్య  నిపుణులు చెప్తున్నారు. డెన్మార్క్‌కు చెందిన బవారియన్‌ నోర్డిక్‌ కంపెనీ మాత్రమే మంకీపాక్స్‌ నివారణకు వ్యాక్సిన్‌ తయారు చేస్తోంది. స్వలింగ సంపర్గం వ్లలే ఈ వ్యాధి.. వ్యాపిస్తుందని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ... వ్యాధిగ్రస్తులకు  సన్నిహితంగా ఉన్న వారికి కూడా... మంకీఫాక్స్‌ అంటుకుంటుందని ఇటీవల గుర్తించారు. దీంతో... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Also Read: