Canada Army Site Hack: 

Continues below advertisement



ఆర్మీ వెబ్‌సైట్ హ్యాక్..


భారత్‌ కెనడా మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్న క్రమంలోనే ఓ నివేదిక సంచలన విషయం వెల్లడించింది. కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ హ్యాక్‌కి గురైంది. The Telegraph వెల్లడించిన వివరాల ప్రకారం...'Indian Cyber Force' గ్రూప్‌ హ్యాకర్స్ ఈ హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తోంది. ట్విటర్‌లో పోస్ట్ కూడా పెట్టింది ఈ గ్రూప్. Canadian Armed Forces వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసినట్టు వరుస ట్వీట్‌లు చేసింది. ఇది సోషల్ మీడియాలో సంచలనమైంది. ఉన్నట్టుండి సైట్ పని చేయకుండా పోయింది. ఆ తరవాత కాసేపటికి రికవర్ అయింది. ట్విటర్‌లో  Indian Cyber Force చేసిన ట్వీట్‌లు వైరల్ అయ్యాయి. "కెనడా ఎయిర్‌ఫోర్స్ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేశాం" అని ట్వీట్ చేసింది. వెబ్‌సైట్‌లో ఎర్రర్ మెసేజ్ వస్తుండడాన్ని స్క్రీన్‌షాట్‌లు తీసి మరీ పోస్ట్ చేసింది. The Globe and Mail రిపోర్ట్ ప్రకారం..చాలా సేపు ఈ వెబ్‌సైట్ పని చేయలేదు. డెస్క్‌టాప్ వర్షన్‌లో వెబ్‌సైట్ ఓపెన్ అయినప్పటికీ...మొబైళ్లలో మాత్రం ఓపెన్ కాలేదు. ఈ సైట్‌ని వెంటనే ఐసోలేట్ చేసింది కెనడా ప్రభుత్వం. ఈ హ్యాకింగ్ వల్ల పెద్ద సమస్యేమీ రాలేదని, ప్రభావం పడలేదని వెల్లడించింది. కెనడా భద్రతా బలగాలతో పాటు మిగతా సెక్యూరిటీ గ్రూప్‌లు ఈ హ్యాకింగ్‌పై విచారణ మొదలు పెట్టాయి. 


రెండు దేశాల మధ్య వైరం..


ఇప్పటికే నిజ్జర్ హత్యపై భారత్, కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించింది భారత్. ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేసింది. కానీ...ఈ ఆరోపణలపై ట్రూడో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ఇంకా కవ్వింపులకు పాల్పడుతున్నారు. ఇక కెనడాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలు కూడా దొరికాయి. ఫలితంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 


హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్. న్యూయార్క్‌లో Council on Foreign Relations ఈవెంట్‌లో పాల్గొన్న ఆయనను మీడియా ప్రశ్నించింది.  Five Eyes ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌పైనా స్పందన ఏంటని అడిగింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన జైశంకర్...ఆ ఇంటిలిజెన్స్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. FBIతో ఏ మాత్రం సంబంధం లేని తనను ఈ ప్రశ్నలు అడగడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తరవాత కూడా మీడియా ప్రశ్నించింది. నిజ్జర్‌ హత్య గురించి ముందుగానే కెనడా భారత్‌కి చెప్పిందని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చిందన్న అంశాన్ని మీడియా ప్రస్తావించింది. అందుకు జైశంకర్ దీటుగానే బదులిచ్చారు. ఎవరైనా అలాంటి సమాచారం అందిస్తే కచ్చితంగా అలెర్ట్ అవుతామని వెల్లడించారు. నిజ్జర్ హత్యకి సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. 


Also Read: బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్, వీసాలు తీసుకుని మరీ విదేశాలకు!