Cambodian Runner: 

Continues below advertisement


సోషల్ మీడియాలో వైరల్..


కాంబోడియాకు చెందిన ఓ రన్నర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రెటీ (Viral Video) అయింది. అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆమె కమిట్‌మెంట్‌కి ఫిదా అవుతున్నారు. సౌత్ఈస్ట్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె..రన్నింగ్ చేస్తుండగానే ఉన్నట్టుండి భారీ వర్షం మొదలైంది. 5 వేల మీటర్ల రేసులో అలుపు లేకుండా పరిగెత్తింది. లాస్ట్ ట్రాక్‌లో ఉండగా వర్షం మొదలైంది. అప్పటికే రన్నింగ్‌లో వియత్నాంకు చెందిన మహిళ విజయం సాధించింది. అయినా...ప్రయత్నాన్ని ఆపకుండా అలానే పరుగులు పెట్టింది...బోవు సమ్నాంగ్ (Bou Samnang).చివర్లో ట్రాక్‌పై ఆమె మాత్రమే మిగిలింది. అప్పటికే తన కన్నా ముందుగా ఓ రన్నర్ దూసుకుపోయింది. అలా అని ఊరుకోలేదు. అంతకన్నా వేగంగా పరుగులు తీసింది. వర్షం పడుతున్నా...ఏ మాత్రం తడబడకుండా అలాగే పరిగెత్తింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. The Olympic Games ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. నెవర్ గివప్ (Never Giveup) అంటూ ట్వీట్ చేశారు. 


"నువ్వు ఆఖరి ప్లేస్‌లో ఉన్నావని తెలిసినా కూడా..వాతావరణం సహకరించకపోయినా..సాధించలేనేమో అని భయం వేసినా సరే...ఎప్పుడూ వెనక్కి తగ్గొద్దు. కాంబోడియా రన్నర్ బోవు సమ్నాంగ్‌ 5 వేల మీటర్ల రన్నింగ్‌లో ఎంత కమిట్‌మెంట్‌తో పరిగెడుతోందో చూడండి. ఆమెను ఏ అవరోధమూ అడ్డుకోలేకపోయింది"


- ఒలింపిక్ గేమ్స్ 






ఆమె రన్నింగ్‌లో ఓడిపోయినప్పటికీ...అందరికీ చేరువవ్వడంలో, స్ఫూర్తి పంచడంలో సక్సెస్ అయింది. వెంటనే మీడియా ఆమె వెంట పడింది. దీనిపై స్పందనేంటి అని అడిగితే..చిరునవ్వుతో సమాధానమిచ్చింది. 


"ఫినిష్ లైన్ వరకూ రీచ్ అవ్వాలన్న పట్టుదలతోనే పరిగెత్తాను. లైఫ్‌లోనూ ఇంతే. మనం స్లోగా వెళ్లినా, వేగంగా పరిగెత్తినా సరే మనం చేరుకునే గమ్యం ఒకటే. అందుకే ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం వెనక్కి తగ్గొద్దు. గట్టిగా ప్రయత్నించాలి. నాకు తెలుసు నేను ఓడిపోతున్నానని. పైగా వర్షం కూడా భారీగా కురుస్తోంది. నిజానికి ఆ రన్నింగ్ ట్రాక్‌ నుంచి బయటకు వచ్చే హక్కు నాకుంది. కానీ నా దేశాన్ని (కాంబోడియా) అక్కడ రిప్రజెంట్ చేయాలని అనుకున్నాను. అందుకే ట్రాక్‌ నుంచి తప్పుకోలేదు"


- బోవు సమ్నాంగ్, రన్నర్ 


ఈ వీడియో చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ పొగుడుతున్నారు. ఓడిపోయినా..అంత పట్టుదలగా ఎలా పరిగెత్తారు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. అందరికీ షేర్ చేస్తున్నారు. 


Also Read: Karnataka Chief Minister: కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది, శివకుమార్‌ను ఎలా కూల్ చేసింది, సిద్దూని ఎలా సీఎంను చేసింది?