మురారీని కృష్ణకి ప్రపోజ్ చేయమని మధుకర్ చెప్తాడు. అది కాస్త ముకుంద కంట పడుతుంది. మురారీ మోకాళ్ళ మీద కూర్చుని కృష్ణకి గులాబీ పువ్వు ఇచ్చి పట్టుకుంటాడు. ఎన్నాళ్ళో నుంచి నా మనసులో ప్రేమని దాచుకుంటూ వస్తున్నా,నిజానికి నిన్ను చూసిన క్షణంలోనే మనసులో ఏదో తెలియని భావం. కానీ అప్పుడు నేను ఉన్న పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు నాలో భయం మొదలైంది ఇప్పటికీ చెప్పకపోతే నన్ను ఎక్కడ వదిలిపోతావోనని భయంగా ఉంది ఐలవ్యూ కృష్ణ అని గులాబీ ఇస్తాడు. ఇలవ్యూ టు ఏసీపీ సర్ అని కృష్ణ కూడా చెప్పి భర్తని కౌగలించుకుంటుంది. సూపర్ గా చేశారని మధుకర్ మెచ్చుకుంటాడు. కృష్ణ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది.


పెద్ద వదిన లేదు కదా మందు తాగుతానని ప్రసాద్ వచ్చి రేవతిని అడుగుతాడు. ఆ మందు బాటిల్ మధుకర్ చేతిలో ఉంటే ప్రసాద్ వచ్చి లాగేసుకుంటాడు. ఇంతలో ఈశ్వర్ వచ్చి బాటిల్ కోసం వెళ్లబోతుంటే మందుకోసమేగా రేవతి అనేసరికి బిత్తరపోతాడు. వెళ్ళి కిచెన్ లో బాటిల్ కోసం చూస్తే అది అక్కడ ఉండదు. కాసేపు రేవతి మొగుడిని ఆడుకుంటుంది. ఈశ్వర్ వచ్చి ప్రసాద్ చేతిలో బాటిల్ తీసేసుకుంటాడు. మురారీ ఫోన్ మాట్లాడుతుంటే ముకుంద ఫోన్ లాక్కుని తన వైఫ్ ని మాట్లాడుతున్నా అర్జెంట్ పని ఉందని ఫోన్ కట్ చేస్తుంది.


ముకుంద: మన ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకు తీసేశావ్


మురారీ: నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏంటి


Also Read: అభిమన్యుని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన చిత్ర- వేద చెల్లి జీవితాన్ని కాపాడగలుగుతుందా?


ముకుంద: ఐలవ్యూ మురారీ ఐలవ్యూ సో మచ్ అనడం మధుకర్ చూస్తాడు


మురారీ: నిన్ను లవ్ చేయడం మానేశాను


ముకుంద: నేను నిన్ను జీవితాంతం లవ్ చేస్తూనే ఉంటాను


మురారీ: అప్పుడు నువ్వు నన్ను సొంతం చేసుకోవడానికి జీవితాంతం ఎదురుచూడాలి


ముకుంద: నేను నిన్ను సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాను


మురారీ: నువ్వే అంట దూరం వెళ్ళడానికి సిద్ధపడితే నేను అంతకంటే ఎక్కువ దూరం వెళ్తాను


ఇన్నాళ్ళూ వీళ్ళ మీద డౌట్ ఉండేది ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది వెంటనే చిన్న పెద్దమ్మని తెచ్చి చూపించాలని మధుకర్ వెళ్ళిపోతాడు.


ముకుంద: ఆదర్శ్ తో విడాకులు తీసుకుని నేను రెండో పెళ్లి చేసుకునేది నిన్నే. ఉంగరం తీసేసినంత మాత్రన నిన్ను మర్చిపోతాను అనుకున్నావా


మురారి: ఉంగరం తీసేశాను అంటే నిన్ను నా మనసులో నుంచి ఎప్పుడో తీసేశానని అర్థం


ముకుంద: నాలుగు రోజుల్లో కృష్ణ వెళ్లిపోతే ఒంటరి వాడివి అయిపోతావు


Also Read: స్వప్న చెంప పగలగొట్టిన కనకం- కావ్య దగ్గర మాట తీసుకున్న రాజ్, రాహుల్ కి పెళ్లి


మురారీ: మంచిది కృష్ణ వెళ్లిపోతే నేను ఒంటరిగానే ఉంటాను అందులోనే నీతినియామాలు ఉంటాయి


ముకుంద: కృష్ణ వెళ్ళేదాక ఆగి నువ్వు నన్ను చేసుకోకపోతే మొత్తం నిజం బయట పెట్టేస్తాను


మురారీ: నేను విసిగిపోయాను కానీ ఇప్పుడు లేదు నీకు నువ్వే నిజం చెప్తే నాకు సాయం చేసిన దానివి అవుతావు


మధుకర్ రేవతిని తెచ్చి చూపిస్తాడు. అప్పుడే వాళ్ళు ఇద్దరూ వెళ్లిపోతారు. వీడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉండాలంటే అనుకుని మధుకర్ చెంప పగలగొడుతుంది. వాళ్ళిద్దరూ మామూలుగా మాట్లాడుకుంటుంటే ప్రేమికులని చెప్తావా అని తిట్టి వెళ్ళిపోతుంది.