Shani Jayanti 2023: గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటాయి. శని ప్రభావం పడితే అన్న యముడుని దాదాపు పరిచయం చేసి తీసుకొస్తాడని( అంటే చావు అంచుల వరకూ తీసుకెళ్లి తీసుకొస్తాడని) అంటారు. అందుకే శని పట్టకుండా ఎవ్వరూ ఆపలేరు కానీ ఆ ప్రభావం తగ్గించేందుకు, శని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు చదవుకోవాలని చెబుతారు పండితులు.


ఓం శం శనయేనమ
ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః 
కోణస్ధః పింగళ బభ్రు
కృష్ణో రౌద్రంతకో యమ: 
సౌరి శనైశ్చరో మంద: 
పిప్పలాదేవ సంస్తుత: 


నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం 
ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం 


Also Read: పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!


ఓం  సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: 
శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని


శని గాయత్రీ మంత్రం
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. 
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ 


శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి


''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.


శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే


ఈ శ్లోకాలను కుదిరితే నిత్యం లేదంటే ప్రతి శనివారం జపించడం వల్ల శనిదోషం తగ్గుతుందని చెబుతారు. ముఖ్యంగా ఆంజనేయుడిని, శివుడిని పూజించినా శని ప్రభావం తక్కువ ఉంటుందంటారు. 


Also Read: మహాభారతంలోని ఈ 4 కథలు నిజం, నేటికీ సజీవం


శని అమావాస్య పరిహారాలు



  • శని అమావాస్య రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనె , నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి

  • ఏలినాటి శని,అష్టమ శని, అర్థాష్టమ శని దోషం తగ్గించుకునేందుకు ఆలయాల్లో శనికి నువ్వుల నూనె, నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించాలి

  • ఈ రోజున పితృ తర్పణం, నదులు-సరస్సుల్లో స్నానం చేసి దానధర్మాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు

  • శ్రమ జీవులైన చీమలకు ఆహారం వేయడం, పశువులు పక్షల దాహం తీర్చడం లాంటివి చేస్తే ఇంకా మంచిది

  • కనీసం తలకి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకుని శనిస్త్రోత్రాలు చదువుకున్నా కొంతవరకూ గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది

  • అన్నింటికన్నా హనుమాన్ చాలీసా పఠిస్తే అన్నిరకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.