ఇద్దరం కలిసి ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పిద్దామని స్వప్న చెప్తే అది కుదరదని రాహుల్ అంటాడు. మన ప్రేమ కథకి విలన్ మీ చెల్లి తను ఉండగా మన పెళ్లి జరగదు. మన ప్రేమ అందమైన జ్ఞాపకం. వాటితోనే బతికేస్తాను దయచేసి నన్ను మర్చిపో అనేసి బాధపడుతున్నట్టు నటిస్తూ వెళ్ళిపోతాడు. దీని అంతటికీ కారణం కావ్య ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావ్ అని తిట్టుకుంటూ ఉండగా అటుగా ఆటోలో కావ్య వెళ్తూ ఆగిపోతుంది. తనని పలకరిస్తుంది.
స్వప్న: రాహుల్ కి నాకు పెళ్లి జరగకుండా ఉండటానికి నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా నేను పైఎత్తులు వేస్తాను
కావ్య: నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్
స్వప్న: నువ్వు ఒక మాయలాడివి నీకంటే అందంగా ఉంటానని తెలివైన దానిని అని నిన్ను పట్టించుకొరని మా పెళ్లికి అడ్డం పడుతున్నావ్ కదా. నేను దుగ్గిరాల ఇంటి కోడలిగా వచ్చి నీమీద పెత్తనం చెలాయిస్తా. మా పెళ్లి జరగకుండా నువ్వు ఎలా ఆపుతావో నేను చూస్తాననేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా రాహుల్ గాడి ప్లాన్ నన్ను బ్యాడ్ చేసి ఇలా చేశావా చూస్తూ ఉండు నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే షాకిస్తానని మనసులో అనుకుంటుంది.
Also Read: వేద కుటుంబానికి క్షమాపణ చెప్పిన మాళవిక- అభి కుట్రని పసిగట్టేసిన 'బ్రహ్మముడి' కావ్య
కృష్ణమూర్తి స్వప్న బ్యాగ్ ని ఇంట్లో నుంచి విసిరికొడతాడు. ఎక్కడికి వెళ్ళావని అడగను, ఎక్కడికి వెళ్లావో అక్కడికే వెళ్ళమని తిడతాడు. అసలు నిన్ను లోపలికి రానివ్వడమే మేము చేసిన తప్పని కనకం అంటుంది. ఈ నీడ కూడా లేకపోతే ఏ గుడిలో తలదాచుకోవాలని అడుగుతుంది. ఇంటి ఆడపిల్లని ఇల్లు వదిలి పొమ్మంటే దాని బతుకు మనమే నాశనం చేసిన్ వాళ్ళం అవుతామని కనకం అక్క కృష్ణమూర్తికి సర్ది చెప్పడానికి చూస్తుంది. కన్నవాళ్ళు మీరే కాదంటే లోకం రానిస్తుందా? మరో రకంగా చూస్తుంది అప్పుడు ఎవరికి పరువు తక్కువ అంటుంది. స్వప్న బయటకి వెళ్లిపోతే కావ్య అక్క కాపురం నిలబెట్టుకోవడానికి అవకాశం పోతుందని అప్పు మనసులో అనుకుంటుంది.
ఈ పెద్దమ్మని నువ్వు ఇంట్లో పడి తింటుందని అన్నావ్ కానీ ఈమె ఇప్పుడు నిన్ను ఇంట్లోకి రానివ్వమని బతిమలాడుతుందని అప్పు అంటుంది. నీ మీద గౌరవంతో దీన్ని లోపలికి రానిస్తాను కానీ మరోసారి తప్పు చేస్తే నువ్వే మెడ పట్టి గెంటేయాలని కృష్ణమూర్తి తన వదినకి చెప్తాడు.
స్వప్న: నా జీవితం ఇలా కావడానికి కారణం నీకూతురు కావ్య. నేను ఒక్కసారి నా స్థానంలోకి వెళ్ళాను అంటే నీకూతురు ఈ ఇంట్లోకి వచ్చేస్తుంది
కనకం: చెంప పగలగొడుతుంది. లోపలికి రానివ్వగానే నీ బుద్ధి చూపించుకున్నావ్. ఇంకోసారి నా కూతురి గురించి మాట్లాడితే చంపేస్తా. ఇది కావ్య గురించి ఇలా మాట్లాడిందంటే దీన్ని వదిలించుకోవాలని మనసులో అనుకుంటుంది.
మీనాక్షికి ఫోన్ చేసి పెళ్ళిచూపులకు అబ్బాయి వాళ్ళని తీసుకురమ్మని కనకం చెప్తుంది. ఇంట్లో అందరూ కావ్య కోసం ఎదురుచూస్తుంది. అప్పుడే కావ్య ఆటోలో ఇంటికి వస్తుంది. కావ్య లోపలికి రాగానే అందరూ తలా ఒక మాట అనేస్తారు. ఎక్కడికి వెళ్ళావని ఇంద్రాదేవి అడుగుతుంది. మీ అన్నయ్య టిఫిన్ తినకుండా వెళ్లారని మళ్ళీ చేసుకుని తీసుకెళ్ళి పెట్టి వస్తున్నానని చెప్తుంది. నీ ప్రయత్నం మంచిదే కానీ చెప్పి వెళ్ళవచ్చు కదా కనీసం ఫోన్ అయినా చేయవచ్చు కదా అని ఇంద్రాదేవి అంటుంది. ఆ అవకాశం నీ కోడలు ఇవ్వలేదు తన ఫోన్ లాక్కుంది కదా రుద్రాణి అంటుంది.
Also Read: జ్ఞానంబ దగ్గర మల్లికని ఇరికించిన మలయాళం- వెన్నెల్లో విహరిస్తున్న రామ, జానకి
ఇల్లు తాకట్టు పెట్టి అయినా సరే స్వప్నకి పెళ్లి చేసి వదిలించుకోవాలని కృష్ణమూర్తి అనేసరికి కనకం టెన్షన్ పడుతుంది. కావ్య రాజ్ గదిలోకి వచ్చి తన ఫోన్ తీసుకుని గతంలో రికార్డు చేసిన గురక సౌండ్ పెడుతుంది. ఆ సౌండ్ విని ఉలిక్కిపడతాడు.