వేదని తాగమని అభిమన్యు ఫ్రెండ్స్ బలవంతం చేయబోతుంటే చెయ్యి ఎత్తి కొట్టబోతుంది. తన చేతిని అభిమన్యు పట్టుకుని అసలు ఎంత ధైర్యం నీకు నా ఫ్రెండ్స్ మీదే చెయ్యి ఎత్తుతావా అంటాడు. అప్పుడే యష్ వచ్చి అభి చేతిని పట్టుకుని పక్కకి తోసేస్తాడు. వేదనే టచ్ చేస్తావా ఏం అనుకుంటున్నావ్ నువ్వని కొట్టబోతుంటే మాళవిక వచ్చి అడ్డుపడుతుంది. నా వేద జోలికి వస్తే చంపేస్తానని అంటాడు. ఇలాంటి వాడితో కలిసి పెళ్లి చేసుకోవాల్సిన ఖర్మ మనకి ఎందుకు, అందుకే ఈ రెండు పెళ్ళిళ్ళు కలిసి చేయొద్దు. వసంత్ పెళ్లి గుడిలో చేద్దాం దానికి కూడా వీళ్ళు రావద్దని యష్ కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. వేద ఎందుకు అంత ఆవేశం కూల్ గా ఉండమని సర్ది చెప్తుంది. కానీ యష్ మాత్రం కోపంతో రగిలిపోతాడు.


Also Read: జ్ఞానంబ దగ్గర మల్లికని ఇరికించిన మలయాళం- వెన్నెల్లో విహరిస్తున్న రామ, జానకి


అభిమన్యు ఇక్కడ అడుగు పెట్టింది మొదలు నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ నిన్ను కామెంట్ చేస్తారా అరుస్తాడు. నిన్ను ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేను ఇప్పుడే వాళ్ళ అంతు చూస్తానని యష్ ఆవేశపడుతుంటే వేద కౌగలించుకుంటుంది. నేను అంటే ఎంత ప్రేమ మిమ్మల్ని ఎంత అవమానించినా లెక్క చేయలేదు. కానీ నన్ను ఒక్క మాట అంటే తట్టుకోలేకపోయారు. మీ ప్రేమ ఇలాగే ఉంటే చాలు నన్ను ఏ మాటలు అవమానాలు బాధించవని చెప్తుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేను ఈ రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరగవు అదే ముహూర్తానికి వసంత్ పెళ్లి గుడిలో జరిపిస్తానని తెగేసి చెప్తాడు. రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి అంటేనే కదా అభిమన్యు పెళ్లి చేసుకుంటానని అన్నది ఇప్పుడు వేరుగా పెళ్ళిళ్ళు అంటే మాళవికని పెళ్లి చేసుకుంటాడో లేదోనని వేద నచ్చజెప్పినా కూడా యష్ వినిపించుకోడు.


మాళవిక కోపంగా అభి దగ్గరకి వచ్చి అరుస్తుంది. ఒళ్ళు తెలియకుండా తాగి వేదని నోటికొచ్చినట్టు మాట్లాడావ్ ఏమైందని రాద్దాంతం చేస్తుంది. యష్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు చిత్ర, వసంత్ ని తీసుకుని వెళ్లిపోయాడని చెప్పేసరికి అభి షాక్ అవుతాడు. వెంటనే వేద దగ్గరకి వెళ్ళి జరిగిన దానికి అభి చాలా బాధపడుతున్నాడని చెప్పి ఒప్పించమని చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో చిత్ర మెడలో తాళి కట్టాలి ప్లాన్ మిస్ అవనివ్వనని అనుకుంటాడు. మాళవిక వేద ఇంటికి వస్తుంటే మాలిని లోపలికి రావొద్దని తిడుతుంది. అభి మీతో అలా ప్రవర్తించడం తప్పే కానీ కావాలని చేయలేదు తాగిన మైకంలో అలా చేశాడు. దయచేసి క్షమించమని వేదని అడుగుతుంది. కావాలంటే అభిని తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తానని చెప్తుంది. కానీ ఇంట్లో మాత్రం ఎవరు మాళవిక మాట వినేందుకు సిద్ధంగా ఉండరు.


Also Read: నందు, తులసిని అల్లాడించిన లాస్య- తల్లికి ఎదురుతిరిగిన విక్రమ్


ఇన్నాళ్ళూ భరించారు ఇంకొక ఐదు గంటలు భరించండి ఈ పెళ్లి జరగకపోతే ఆదిత్య జీవితం నాశనం అవుతుంది. తర్వాత అభి నా మాట వింటాడో లేదో? ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే తన జీవితం రోడ్డు పాలు అవుతుందని అందరినీ బతిమలాడుతుంది. చిత్ర పెళ్లికి ఒప్పుకోమని అడుగుతుంది. మాళవిక చేతులెత్తి దణ్ణం పెట్టి మరీ బతిమలాడుతుంది. ఇప్పటికే ఒకసారి నా జీవితం నాశనం చేసుకున్నా ఒక బిడ్డని దూరం చేసుకున్నా, అభి కూడా మనసు మార్చుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ తనని పెళ్లి చేసుకోడని బతిమలాడుతుంది. వేద నచ్చజెప్పేసరికి మాలిని ఒప్పుకుంటుంది. ఇదే చివరి అవకాశం ఇంకోసారి ఇలా జరిగితే క్షమించేది లేదని వార్నింగ్ ఇస్తుంది.