ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా విపక్షాలపై మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. అలానే కరోనా కారణంగా దేశం ఎదుర్కొంటోన్న సంక్షోభం గురించి ప్రస్తావించారు.
కరోనా సంక్షోభంలో భారత్ ఓ లీడర్‌గా వ్యవహరించింది. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. కానీ దేశంలో విపక్షాలు మాత్రం సర్కార్‌ను నిందించడమే పనిగా పెట్టుకుంది. ఈరోజు పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్ దొరుకుతుంది. ప్రభుత్వం ఇళ్లు, మరుగుదొడ్లు కట్టిస్తోంది. వారికంటూ బ్యాంకు ఖాతా ఉంది. కానీ కొంతమంది (ప్రతిపక్షం) బుర్ర మాత్రం 2014 వద్దే ఉండిపోయింది. - ప్రధాని నరేంద్ర మోదీ
కాంగ్రెస్‌పై సెటైర్లు..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్‌ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
వందేళ్లు మాదే..
మీరు నన్ను వ్యతిరేకించవచ్చు. కానీ ఫిట్ ఇండియా పథకాన్ని, ఇతర పథకాలను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడినప్పుడు మీరు నన్ను విస్మరిస్తారు. మోదీ చెప్పారు కాబట్టి ఆ పదాన్నే పలకకూడదని మీరు అనుకుంటారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని మహాత్మా గాంధీనే స్వయంగా చెప్పారు. వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని మీరు నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉంటాం. - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: UP Election 2022: 'ఓవైసీపై దాడి ట్రైలర్ మాత్రమే.. సీఎం యోగి కాన్వాయ్‌ను పేల్చేస్తాం'