Global Leader Approval Rating: మళ్లీ అయ్యగారే నం.1.. మరెవురివల్లా కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా మోదీ క్రేజ్

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్‌ను నిలబెట్టుకున్నారు. గ్లోబల్ లీడర్ అప్రూవల్ జాబితాలో మోదీ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు.

Continues below advertisement

ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి మోదీ పాపులారిటీ పెరుగుతూనే ఉంది. తాజాగా 2022 గ్లోబల్ లీడర్ అప్రూవల్ లిస్ట్‌లో మరోసారి మోదీ టాప్ ర్యాంక్ సాధించారు. అమెరికన్ రీసెర్చ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్.. ఈ నివేదిక తయారు చేసింది.

Continues below advertisement

ప్రపంచ నేతలందిరితోనూ పోలిస్తే మోదీ అత్యధికంగా 72 శాతం స్కోర్ సాధించారు. అమెరికా అధ్యక్షుడు జోడ్ బైడెన్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌లను వెనక్కి నెట్టి మోదీ టాప్ ప్లేస్ సాధించారు.  

ఈ జాబితాలో మోదీ టాప్ పొజిషన్‌లో ఉండటం ఇది వరుసగా మూడోసారి. అయితే ఈసారి మోదీకి ఇతర నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా బాగా పెరిగింది.

మోదీ తర్వాత..

ఈ టాప్ ప్లేస్ కోసం మొత్తం 13 మంది పోటీ పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానం సాధించారు.

  1. నరేంద్ర మోదీ- భారత ప్రధాని (72%)
  2. లోపేజ్ ఓబ్రడార్- మెక్సికన్ అధ్యక్షుడు (64%)
  3. మేరియో డ్రాఘీ- ఇటలీ ప్రధాని (57%)
  4. ఫ్యుమియో కిషిడా- జపాన్ ప్రధాని (47%)
  5. స్కోల్జ్- జర్మనీ ఛాన్స్‌లర్ (42%)
  6. జో బైడెన్- అమెరికా అధ్యక్షుడు (41%)
  7. మూన్ జే- దక్షిణ కొరియా అధ్యక్షుడు (41%)
  8. స్కాట్ మారిసన్- ఆస్ట్రేలియా ప్రధాని (41%)
  9. జస్టిన్ ట్రూడో- కెనడా అధ్యక్షుడు (41%)
  10. సాంచేజ్- స్పెయిన్ ప్రధాని (37%)
  11. బోల్సోనారో- బ్రెజిల్ అధ్యక్షుడు (36%)
  12. ఇమ్మాన్యుయేల్ మేక్రాన్- ఫ్రాన్స్ అధ్యక్షుడు (35%)
  13. బోరిస్ జాన్సన్- యూకే ప్రధాని (30%)

ఆ నలుగురు..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, దక్షిణా కొరియా అధ్యక్షుడు మూన్ జే, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నలుగురికి 41 శాతం రేటింగే వచ్చింది.

ఈ జాబితాలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ చివరి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్ రాజకీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొవిడ్ 19 లాక్‌డౌన్ సమయంలో పార్టీ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also read: India Corona Cases: దేశంలో లక్ష దిగువకు పాజిటివ్ కేసులు, తాజాగా కొవిడ్‌తో 895 మంది మృతి

 

Continues below advertisement