Breaking News: తెలుగు రాష్ట్రాల్లో వీడని ముంపు భయం- ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

Breaking News: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ ఖమ్మం, విజయవాడ ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్త వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండిక్కడ.

ABP Desam Last Updated: 03 Sep 2024 09:24 PM
వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు

వరద బాధితుల సహాయార్ధం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించిన  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.


 





ట్రాక్టర్ కింద నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన బెజవాడ పోలీసులు

అజిత్ సింగ్ నగర్ - గుర్తుతెలియని మృతదేహాన్ని ట్రాక్టర్ కింద నుంచి బయటకు తీసిన బెజవాడ పోలీసులు

వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలించారు. * రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు

ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు.. సముద్రంలోకి 7,46,844 క్యూసెక్కుల నీరు.. కాలువలకు 500 క్యూసెక్కుల నీటి విడుదల.. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,47,344 క్యూసెక్కులు.. బ్యారేజీ నీటిమట్టం 17.4 అడుగులు

విజయవాడ వరద బాధితులకు నెల్లూరు ఎంపీ కోటి విరాళం

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు చెక్కు అందచేశారు.






 

వరద బాధితులకు సాయం, సాయి సింధుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

చిన్న వయసైనా…పెద్ద మనసున్న చిట్టితల్లి ముత్యాల సాయి సింధు.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన…ఈ పదో తరగతి విద్యార్థిని వరద బాధితుల సహాయార్థం…తన కిట్టీ బ్యాంక్ నుండి రూ.3000 అందజేసింది.
సాయి సింధుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.






 

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌- 10 మంది మావోయిస్టులు మృతి 

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బతగిలింది. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- స్పాట్‌లోనే ఇద్దరు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు, లారీ ఢీ కొనడంతో అక్కడే అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పాలకుర్తి మండలం వావిలాల మల్లంపల్లి మధ్యలో సబ్ స్టేషన్ టర్నింగ్ వద్ద బస్సు లారీ ఢీ కొన్నాయి. ఆర్టీసి బస్ డ్రైవర్ సైడ్ లారీ డీ కొట్టింది. దీంతో  ప్రయాణికుల్లో ఇద్దరు బస్సులోనే అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లాలోని వెలికట్ట గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు కాగా మరొకరు పాలకుర్తి మండలానికి చెందిన ఒక వ్యక్తి గా గుర్తించారు.

నీట మునిగిన వట్టెం పంప్ హౌజ్

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కుమ్మెర వద్ద నిర్మిస్తున్న వట్టెం పంప్ హౌజ్ నీట మునిగింది. ప్యాకేజ్ 7లో నుంచి భారీగా వరద వస్తోంది. ఆ నీరు ప్యాకేజ్ 8లోకి వస్తుండటంతో పనులు నిలిపేశారు. 18 నుంచి 20 కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచిపోయింది. నాగనూల్,నాగర్ కర్నూల్ చెరువుల నుంచి సొరంగ మార్గంలోకి చేరిన వరద వచ్చి చేరుతోంది. 

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లోకి 3,40,613.క్యూసెక్కుల వరద నీరు రాక

Telangana Floods: నాగార్జున సాగర్‌లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులైతే... ప్రస్తుత నీటి మట్టం 586.20 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టిఎంసిలు ఉంటే... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం  301.35.టీఎంసీలుగా అధికారులు తెలియజేశారు. ఇన్ ఫ్లో.3,40,613.క్యూసెక్కులు ఉంటే... ప్రస్తుతం 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు ఔట్ ఫ్లో 4,84,641.క్యూసెకుల నీటి విడుదల చేస్తున్నారు. 

Trains Information: ఇవాళ రద్దైన ట్రైన్స్‌ వివరాలు

Telangana And Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో స్కూల్స్‌కి సెలవులు 

Telangana And Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఈ మూడు రోజులు కూడా వర్షాలు భారీగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఆయా జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇచ్చింది. 

Background

Breaking News: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ముంచెత్తిన వరదలు కారణంగా భారీగానే నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేల కోట్ల నష్టం జరిగినట్టు ప్రభుత్వాలు ప్రాథమికంగా అంచనా వేసింది. ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు యావత్ యంత్రాంగం అందులో నిమగ్నమై ఉంది. రెండు రాష్ట్రాల్లో ప్రకృతి విధ్వంసానికి దాదాపు 40 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ఇంకా కొందరు గల్లంతైనట్టు తేల్చారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. 


ఏపీలో పరిస్థితి చూస్తే....
వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది. దాదాపు రెండు వేల కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తోంది. ఇప్పటికే నీట మునిగిన బాధితలు 176 పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్టు పేర్కొంది. వీళ్ల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపింది. 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. బాధితులకు ఫుడ్, వాటర్ బాటిల్స్ ఇచ్చేందుకు బోట్లు, డ్రోన్లు, హెలికాప్టర్ల ఉపయోగిస్తోంది ప్రభుత్వం. ఇంకా ఎమర్జెన్సీ టైంలో సహాయం కావాలనుకునే వాళ్లు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయమని చెబుతోంది. 


విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులు అవుతున్నా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పునరుద్ధరణ కాలేదు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం  కల్పిస్తోంది. పునరావాసం, బాధితులకు అత్యవసర సేవలపై ఫోకస్‌ ఎక్కవ పెట్టిన ఏపీ ప్రభుత్వం జరిగిన నష్టాన్ని అంచనా వేయడంపై కూడా ఫోకస్ పెట్టింది. ఏపీలో దాదాపుగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చిన ప్రభుత్వం ఇందులో వరి పంట ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. వర్షాల ప్రభావం ఉన్న ఇరవైకిపైగా జిల్లాల్లో నష్టం వాటిల్లిందన్నారు. ఆజిల్లాల్లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలే ఎక్కువగా నష్టపోయినట్టు తెల్చింది. ఈ వర్షాల ప్రభావానికి సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో నీట మునిగితే గోదావరి జిల్లాల్లో దాదాపు 30 వేలకుపైగా ఎకరాల్లో పంట నాశనమైంది. వరిరైతులతోపాటు పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర రైతులు కూడా భారీగా నష్టపోయారు. 


తెలంగాణలో నష్టాన్ని చూస్తే...


తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో వర్షలు, వరదల కారణంగా దాదాపు 20 మందిచనిపోయారు. ఐదు వేల మందికిపైగా ప్రజలకు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు వర్షాలు, వరదలతో దాదాపు ఆరువేల కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిపింది. మహబూబాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, సూర్యపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం కలిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా రోడ్లు కూడా  దెబ్బతిన్నాయి. దీని పునరుద్ధరణకు రెండువేల కోట్లకుపైగానే అవసరం ఉంటుంది. ట్రాన్స్‌కోకి కూడా భారీ నష్టం వాటిల్లింది. స్తంభాలు కూలిపోయి వైర్ల తెగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్స్‌, విద్యుత్ సబ్‌స్టేషన్లు నీట మునిగిపోయాయి. వీటిని బాగు చేయడానికి రిపేర్ల కోసం దాదాపు 150 కోట్లకుపైగానే నిధులు అవసరం అవుతాయి. ఆసుపత్రుల్లో వసతులు, వీధిలైట్లు, డ్రైనేజీలు, ఇతర నష్టాలు దాదాపు 15 వందల కోట్లకుపైగానే ఉండొచ్చని అంచనాకు వచ్చారు. ఓవరాల్‌గా ఆరు వేల కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.