Telugu breaking News:నల్లగొండ సభ ఉన్నందునే ప్రభుత్వం వెనక్కి తగ్గింది: సభలో హరీష్‌రావు 

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 12 Feb 2024 01:43 PM
కాంగ్రెస్‌కు భారీ షాక్‌- పార్టీకి అశోక్‌ చవాన్‌ రాజీనామా

మహారాష్ట్రంలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ చవాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. 


రెండు నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించేశారు: హరీష్‌రావు

పదేళ్లు కేసీఆర్‌ ఉన్నప్పుడు చేయనిది... కాంగ్రెస్ వచ్చిన రెండు నెలల్లోనే కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు హరీష్‌రావు. 

అసెంబ్లీలో మాకు ప్రజేంటేషన్ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు : హరీష్‌

అసెంబ్లీలో మాకు ప్రజంటేషన్ అవకాశం ఇవ్వడం లేదు ఎందుకని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. అన్ని వాస్తవాలు సభకు తెలియాలన్నారు. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజల విజయమన్నారు. ఇది బి ఆర్ ఎస్ పార్టీ విజయమని పేర్కొన్నారు. రేపు నల్లగొండలో సభ పెట్టుకోవడం చూసి ఈరోజు స్పందించారని అభిప్రాయపడ్డారు. చేసిన తప్పులు సవరించుకున్నందుకు ధన్యవాదాలన్నారు. 

నల్లగొండ సభ ఉన్నందునే ప్రభుత్వం వెనక్కి తగ్గింది: సభలో హరీష్‌రావు 


వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే ప్రజంటేషన్ ఇరు పక్షాలు ఇవ్వాలి. కానీ దానికి స్పీకర్ అంగీకరించకపోవడం దురదృష్టకరమన్నారు హరీష్‌రావు దీనిపై స్పందించిన గత సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అయినా నల్లగొండలో సభ ఉన్నందునే భయపడి ప్రభుత్వం ప్రాజెక్టులపై తప్పును సరిదిద్దుకుందన్నారు. 

Background

Latest Telugu breaking News: కృష్ణా ప్రాజెక్టుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను కేటీఆర్ అందించారు. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి తమ పార్టీ చేసిన ఒత్తిడే కారణమని ట్వీట్ చేశారు. 
మాజీ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్ అకౌంట్‌లో ఏమన్నారంటే... చలో నల్గొండ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా 13న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ సాధించిన మొదటి విజయం. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.