Beer Tin Photo:



ఐపీఎల్‌ సంబరాల్లో..


"మా వాడు చాలా బుద్ధిమంతుడు. ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు" మన ఇండియన్ పేరెంట్స్ అందరూ తమ పిల్లల గురించి ఇలానే గొప్పలు చెప్పుకుంటారు. తల్లిదండ్రుల ముందు కొందరు అలా అమాయకంగా నటిస్తారు. ఫ్రెండ్స్‌తో కలిసి చేయాల్సినవన్నీ చేసేస్తారు. కానీ...ఒక్కోసారి అనుకోకుండా దొరికిపోతారు. ఓ కుర్రాడు అలానే అడ్డంగా బుక్ అయ్యాడు. IPL సంబరంలో బీర్‌ తాగుతున్నాడు. తాగినోడు సైలెంట్‌గా ఊరుకోవచ్చుగా. వెంటనే బీర్ టిన్‌ ఫోటో తీసి "ముంబయి గెలుస్తుంది...లెట్స్ గో" అని వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టాడు.  ఫ్రెండ్స్ గ్రూప్‌లో పెట్టాననే అనుకున్నాడు. కానీ...ట్విస్ట్  ఏంటంటే...మనోడు ఆ ఫోటోని ఫ్యామిలీ గ్రూప్‌లో పెట్టాడు. ఇంకేముంది...ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఇది చూసి షాక్ అయ్యారు. "నీకు తాగే అలవాటుందా..? ఇదేంటి..?' అని ప్రశ్నించారు. అప్పటికి కానీ ఆ కుర్రాడికి అర్థం కాలేదు ఎంత తప్పు చేశాడో.  అంటూ ఆ ఫ్యామిలీ గ్రూప్‌లో ఉన్న అన్న పర్సనల్‌గా ఆ కుర్రాడికి మెసేజ్ పెట్టాడు. "రేయ్ నువ్వు ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేశావ్‌రా" అని అలెర్ట్ చేశాడు. డిలీట్ చేయమని తిట్టాడు. అప్పుడైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలిగా. "డిలీట్ ఫర్ ఆల్" కి బదులుగా "డిలీట్ ఫర్ మి" అనే ఆప్షన్‌ని క్లిక్ చేశాడు. ఇంకేముంది...గ్రూప్‌లో నుంచి ఆ ఫోటో డిలీట్ అవ్వలేదు. ఆ తరవాత పెద్ద రచ్చ జరిగింది. ఆ కుర్రాడి అన్న ఈ ఛాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని ట్విటర్‌లో షేర్ చేశాడు. "మా తమ్ముడు చేసిన పని ఇది" అంటూ పోస్ట్ చేశాడు. అలా పెట్టాడో లేదో వెంటనే వైరల్ అయిపోయాయి. నెటిజన్లు ఈ మెసేజ్‌లు చదువుకుని కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. "తాగితే తాగావ్..ఆ ఫోటోలు అవసరమా" అని ఆ కుర్రాడికి క్లాస్ పీకుతున్నారు. ఇంకొందరైతే "సెల్ఫ్ డ్యామేజ్ ఎలా చేసుకోవాలి అనే కోర్స్ చేసుంటాడు" అని ఫన్నీగా స్పందిస్తున్నారు.