పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇవి రోజు ముఖ్యమైనవి. అయితే మనలో ఎంతమంది వీటిని అనుసరిస్తున్నారు? చాలా మంది బ్రేక్ ఫాస్ట్ తినడం స్కిప్ చేస్తారు. దానికి బదులు ఒక అరటిపండు, ఒక గ్లాసు పాలతో కానిచ్చేస్తారు. టైమ్ లేకపోతే టీ బిస్కెట్స్ తో ముగించేస్తారు. బరువు తగ్గించుకోవడం ఎక్కువ మంచి చేస్తున్న పని. ఇక రాత్రి పూట అన్నం తినకుండా ఈవినింగ్ కాస్త స్నాక్స్ ఎక్కువ తినేసి భోజనం మానేస్తారు. హస్టిల్ కల్చర్ లో జీవించే వాళ్ళు లంచ్, డిన్నర్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ భోజనం సరిగా చేయకపోవడం వల్ల కనిపించే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక రోజులో సరిగా తినకపోతే శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?


విపరీతమైన ఆకలి


పగటి పూట ఆకలి విపరీతంగా ఉంటుంది. భోజనం మానేసినప్పుడు అతిగా తింటారు. కణాలు, శరీరానికి ఆహారాన్ని కోరుకునేలా చేస్తుంది. ఫలితంగా అతిగా తినడానికి కారణమవుతుంది. అటువంటి సమయంలో అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటారు. ఆకలితో ఉన్నపుడు ఏం తింటున్నాం ఏది తినకూడదనే ఆలోచన రాదు. జంక్ ఫుడ్ మీదకి మనసు వెళ్ళిపోతుంది. వాటిని తిని అనారోగ్యానికి గురవడం బరువు పెరగడం జరుగుతుంది.


జీవక్రియని ప్రభావితం చేస్తుంది


రోజూ భోజనాన్ని దాటవేయడం వల్ల సిస్టమ్ ఆకలి మోడ్ లోకి వెళ్ళిపోతుంది. శక్తిని నిల్వ చేయడానికి శరీరం ప్రయత్నం చేస్తుంది. అల్పాహారం లేదా రాత్రి భోజనం తీసుకోకపోవడం వల్ల మొత్తం జీవక్రియని తగ్గిస్తుంది. బరువు తగ్గించే ప్రక్రియను నెమ్మదిస్తుంది.


ఆకలి ఎక్కువ


భోజనం మానేస్తే మెదడు చికాకు పెట్టేస్తుంది. బలహీనమైన అభిజ్ఞా పనితీరు కలిగి ఉంటుంది. శరీరం కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆకలి ఎక్కువగా ఉంటుంది.


హార్మోన్లలో మార్పులు


భోజనం మానేయడం వల్ల శరీరం ఆకలితో ఉండటం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోతాయి. అధిక కార్టిసాల్ స్థాయిలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతాయి. వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర అసమతుల్యత ఏర్పడుతుంది.


పోషకాహార లోపం


రోజూ భోజనం మానేస్తే అనుకున్న దాని కంటే తక్కువ తింటారని అర్థం. ఫలితంగా పోషకాలు తీసుకోవడం తగ్గిపోతుంది. తద్వారా పోషకాహార లోపాలకు గురవుతారు. శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల చిన్న చిన్న పనులు చేసినా కూడా త్వరగా అలిసిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. రోగాలు దాడి చేస్తాయి. అనారోగ్యాల పాలవుతారు. అందుకే ఖచ్చితంగా రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ముక్కు, గొంతు, చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు వదిలేయండి