శరీరంలోని ప్రతి భాగం ముఖ్యమే. ఏ ఒక్కటి లేకపోయినా కూడా పనులు సరిగా నిర్వర్తించలేము. అందుకే శరీర భాగాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కొంతమందికి చెవుల్లో పుల్లలు, పిన్నీసులు పెట్టుకుని తిప్పే అలవాటు ఉంటుంది. మరికొంతమందికి ముక్కులో వేళ్ళు పెట్టి తెగతిప్పేస్తారు. కానీ ఇవేవీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఈ మూడు భాగాల పనితీరు సరిగా ఉండాలంటే ఈ అలవాట్లు విస్మరించాలి.
⦿ చెవుల్లో గుబిలి (జిగురు లాంటి పదార్థం) తీసుకునేందుకు ఎక్కువగా పిన్నీసులు వంటి లోహ వస్తువులు పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల చెవి దెబ్బతింటుంది. ఇయర్ డ్రమ్ కి గాయం కలిగించవచ్చు. లేదంటే గుబిలిని వెనక్కి నెట్టేస్తుంది.
⦿ ఈరోజుల్లో పాటలు వినడానికి ఇయర్ ఫోన్స్, బడ్స్ వినియోగిస్తున్నారు. అవి చెవులకు ఆరోగ్యకరం కాదు. వీలైతే వాటిని ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది. చెవులకు నష్టం కలిగించి వినికిడి లోపం వచ్చేలా చేస్తుంది.
⦿ చెవిని పొడిగా ఉంచాలి. నీరు లేదా ఇతర ఎటువంటి ద్రవాలు వేయకూడదు. వాటి వల్ల చెవులు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాటిని తేమగా ఉంచకూడదు.
⦿ చెవులు వినికిడి ఎలా ఉందో కనీసం ఏడాదికి ఒకసారి అయినా డాక్టర్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయించుకోవాలి.
⦿ పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ వృత్తిలో భాగం అయితే చెవులకు సరైన రక్షణా చర్యలు తీసుకోవాలి.
గొంతుని ఆరోగ్యంగా ఉండాలంటే..
⦿ విపరీతమైన చలి వాతావరణానికి తిరగడం వల్ల గొంతులోకి చల్లటి గాలి వెళ్తుంది. ఫలితంగా జలుబు, గొంతు నొప్పి ఎదురవుతాయి. గాలి చొరబడకుండా మఫ్లర్ ఉపయోగించడం మంచిది.
⦿ బిగ్గరగా అరవడం కేకలు వేయడం వల్ల గొంతు నొప్పి ఎక్కువవుతుంది. స్వర పేటికకి విశ్రాంతి అవసరం. లేదంటే గొంతు దెబ్బతింటుంది.
⦿ తినే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నూనె, వేయించిన్, చల్లని ఆహారాన్ని తినడం వల్ల గొంతుపై ప్రభావం చూపుతుంది. బర్నింగ్ సెన్సేషన్, పొడి దగ్గు, కొన్ని సార్లు గొంతు కూడా మారిపోతుంది.
⦿ వోకల్ వార్మప్, వోకల్ న్యాప్ రెండూ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్ కి అవసరం. ఇది వాయిస్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
⦿ పొడి వాతావారణంలో ఉంటే ఇంట్లో హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి. ఇది పొడిని నివారిస్తుంది. గొంతు తడి ఆరిపోతే తీవ్ర సమస్యలు వస్తాయి.
ముక్కు కోసం..
⦿ శ్వాస వ్యాయామాలు సాధారణంగా మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి.
⦿ ముక్కు మీద అధిక ఒత్తిడి తీసుకురాకూడదు. ముక్కు నుంచి రక్తస్రావం జరిగేలా చేస్తుంది.
⦿ డస్ట్ అలర్జీ ఉంటే దుమ్ము, పొగ వాటిని పీల్చుకోకుండా ముక్కుకి మాస్క్ ధరించడం ముఖ్యం.
⦿ జలుబు రావడానికి వైరల్ ఇన్ఫెక్షన్లు సోకడానికి మార్గం ముక్కు, గొంతు. అందుకే వాటిని కప్పి ఉంచేలా మాస్క్ పెట్టుకోవడం అత్యవసరం.
జీవనశైలి అలవాట్లలో మార్పులు చేసుకుంటే చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మెరుగైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.