Viral News: అసలే వర్క్ ప్రెజర్. దానికి తోడు బాస్ అక్షింతలు. ఇదంతా కలిసి ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్లిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక, ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక డిప్రెషన్‌కి గురవుతారు. ఇలాంటి వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో పని చేయడం అవసరమా అని రిజైన్ చేసేస్తారు. కానీ చైనాలోని ఉద్యోగులు మాత్రం ఏకంగా బాస్‌లకే ఎసరు (Bosses For Sale) పెడుతున్నారు. తమ ఒత్తిడి తగ్గించుకునేందుకు కొత్త మెథడ్ ఫాలో అవుతున్నారు. తమకు నచ్చిన బాస్‌లు, కొలీగ్స్, జాబ్స్‌ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. చైనాలో ఈ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. సెకండ్ హ్యాండ్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో బాస్‌లను అమ్మేస్తున్నారు ఉద్యోగులు. నచ్చకపోతే చాలు. వెంటనే పేర్లన్నీ లిస్టౌట్ చేసి దాన్ని Alibaba లాంటి సైట్‌లలో పెట్టేస్తున్నారు. పని ఒత్తిడినంతా ఇలా దూరం చేసుకుంటున్నారు. South China Morning Post వెల్లడించిన వివరాల ప్రకారం ఆయా సైట్‌లలో బాస్‌ల పేర్లతో పాటు నిక్‌నేమ్స్‌నీ పెడుతున్నారు. రూ.4-9 లక్షలకు అమ్మేస్తామని ప్రైస్‌ట్యాగ్ కూడా పెట్టేస్తున్నారు. ఓ యూజర్ తన జాబ్‌ని రూ.91 వేలకు అమ్ముకున్నాడు. పైగా ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. 91 వేలు ఒకేసారి కట్టాల్సిన పని లేదని నెలకు రూ.30 వేల చొప్పున మూడు నెలల పాటు చెల్లించొచ్చని చెప్పాడు. ఇంకొందరు కొలీగ్స్‌నీ అమ్మేస్తున్నారు. "ఈ కొలీగ్‌ని అమ్మేస్తున్నా. కావాలంటే కొనుక్కోవచ్చు. రూ.45 వేలకు బేరం పెడుతున్నా. ఈ వ్యక్తితో ఎలా నడుచుకోవాలో టిప్స్ కూడా ఇస్తాను" అని ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు.
పదేపదే తిడుతున్న బాస్‌లనీ అమ్మేస్తున్నారు ఉద్యోగులు. "ఏం చేసినా తిడుతున్నాడు. అందుకే అమ్మేస్తున్నా" అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. ఇంతకీ ఇదంతా నిజమే అనుకుంటారేమో. జస్ట్ వాళ్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు సరదాకి చేసిన పని ఇది. కానీ కొందరు నిజమే అనుకుని సైట్‌కి డబ్బులు కూడా కడుతున్నారట. ఇదేదో కొంప ముంచేలా ఉందనుకుంది కొందరు యూజర్లు తమ పోస్ట్‌లని డిలీట్ చేసేస్తున్నారు. కొలీగ్స్, బాస్‌లపై రివెంజ్ తీర్చుకోడానికి ఇలా కొత్త రూట్ కనుగొన్నారు చైనా ఎంప్లాయీస్. అయితే...ఈ ఆఫర్‌లపై నెటిజన్‌లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు "సూపర్ ఐడియా" అని పొగుడుతుంటే...ఇంకొందరు ఇదేం ట్రెండ్ అని మండి పడుతున్నారు.
ఇటీవల సౌత్ కొరియాలో ఓ వింత ఘటన జరిగింది. ఓ ఆఫీస్‌లో పని చేస్తున్న రోబో పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది. రోబో ఏంటి సూసైడ్ చేసుకోవడమేంటని అంతా ఆశ్చర్యపోయారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నాన్‌స్టాప్‌గా పని చేసిన రోబో ఆ వర్క్‌లోడ్‌ని తట్టుకోలేక మెట్లపై నుంచి దూకింది. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఇన్సిడెంట్‌పైనా నెటిజన్‌లు సెటైర్లు వేస్తున్నారు. "ఈ మనుషులు రోబోలనూ టార్చర్ చేసేస్తున్నారు" అని ఫన్నీగా స్పందిస్తున్నారు.