Boon for Blind People : శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో కళ్లు ఒకటి. అవే లేకపోతే ఈ ప్రపంచంలో ఏం జరిగినా చూడలేం. కనీసం ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ పనైనా చేయాలన్నా కళ్లు లేకపోతే చాలా కష్టం. మనం వారి బాధను కేవలం చూసి.. అయ్యో పాపం అంటామే తప్ప ఏం చేయలేం. కానీ ఓ ఇద్దరు విద్యార్థులు మాత్రం అలా చూసి వదిలేయలేదు. వారి కోసం ఏదైనా చేయాలని తపించారు. మొత్తానికి వారనుకున్న లక్ష్యాన్ని సాధించి చూపించారు. అవతలి వారిని గుర్తించేలా అంధుల కోసం ప్రత్యేకంగా కళ్లజోడు తయారు చేసి చరిత్ర సృష్టించారు. వారికో మార్గం చూపించారు.


ఐవోటీ సెన్సార్లతో కళ్లజోడు తయారీ


మొరాదాబాద్‌లోని ఎంఐటీ కళాశాలలో చదువుతోన్న ఇద్దరు విద్యార్థులు ఇప్పుడు అంధుల ఎదుటి వారి ముఖాలను సులభంగా గుర్తించేందుకు ఓ సెన్సార్ గ్లాసెస్‌ను తయారు చేశారు. IoT సెన్సార్లను ఉపయోగించి రూపొంచిన ఈ కళ్లజోడు.. పర్యావరణంలో జరిగే సన్నివేశాలు, సమాచారాన్ని ఆడియో రూపంలో అందిస్తుంది. ఐఐటీ (IIT) ముంబైలో నిర్వహించిన మూడు రోజుల ఆసియాలో అతిపెద్ద టెక్‌ఫెస్ట్ 24లో ఎంఐటీ (MIT) కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్థాపించిన స్టార్టప్ కేడర్ టెక్నాలజీస్ సర్వీసెస్ నుంచి ఇంటర్న్‌షిప్ చేస్తున్న కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 'ధైర్య సారస్వత్', శాశ్వత్ సింఘాల్ ఉన్నారు.


అంధులకు ఉపయోగకారిగా స్మార్ట్ గ్లాసెస్


క్యాడర్ టెక్ ప్రధానంగా సహాయక సాంకేతికతపై పరిశోధనలు చేస్తోంది. ఇక స్టూడెంట్స్ తయారు చేసిన ఈ కళ్లజోడు.. అంధులు తమ పరిసరాలకు సంబంధించిన సమాచారాన్ని ఫేషియల్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ లాంటి వాటి ద్వారా ఆడియో రూపంలో అందిస్తుంది. ఐఐటీ ముంబైలో వారి ఆవిష్కరణను ప్రదర్శించడానికి, ఈ ఇద్దరు విద్యార్థులను  ప్రదర్శించడానికి కంపెనీ భారతదేశ కార్యాలయం నియమించింది.


విద్యార్థుల ప్రాజెక్టుపై ప్రముఖుల ప్రశంసలు


స్టూడెంట్స్ తయారు చేసిన కళ్లజోడుపై స్పందించిన ఎంఐటీ కళాశాల డైరెక్టర్ రోహిత్ గార్గ్.. తమ కళాశాలకు చెందిన ఇద్దరు పిల్లలు అంధుల కోసం చాలా మంచి ప్రాజెక్టును రూపొందించారన్నారు. ఇందుకు తమ కళాశాల ఉపాధ్యాయులను, ఈ ఇద్దరు విద్యార్థులను అభినందిస్తున్నానని చెప్పారు. దీంతో పాటు, ఈ ప్రాజెక్ట్ అంధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తాను నమ్ముతున్నానన్నారు. ఇదే విషయంపై ఎంఐటీ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తమ విభాగంలోని ఇద్దరు స్టూడెంట్స్ కొత్త పరిశోధన చేశారన్నారు. దీని ద్వారా అంధులు చాలా సహాయాన్ని పొందవచ్చని, దీంతో తమ దృక్పథాన్ని మార్చుకుని ఎక్కడికైనా వెళ్లగలరన్నారు.


Also Read : Elon Musk: యునైటెడ్ స్టేట్స్‌కు పొంచి ఉన్న ప్రమాదం - ఆయన నుంచి అమెరికాను రక్షించండి - మస్క్ ఆరోగ్యంపై రచయిత ఆందోళనలు