JP Nadda on Rahul Gandhi:
నడ్డా అసహనం..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్ గాంధీపై మరోసారి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. డెమొక్రసీపై నమ్మకం లేని వారికి..ఈ ప్రజాస్వామ్య దేశంలో స్థానం లేదంటూ ఘాటుగా స్పందించారు. చెన్నైలో నేషనల్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో వర్చువల్‌గా హాజరైన నడ్డా...ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మతి పోయిందని, అందుకే భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశాలను జోక్యం చేసుకోవాలని అడుగుతోందని మండి పడ్డారు. అమెరికా, యూరప్ దేశాలను భారత్‌లోని ప్రజాస్వామ్యాన్ని చక్కదిద్దాలని అడగడంపై అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ హద్దులు దాటి మాట్లాడారని అన్నారు. ఆయన మాటల్ని ప్రజలు లెక్క చేయొద్దని సూచించారు.
"రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి దేశం పరువు తీయడమే కాదు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకోవాలని అన్నారు. ఇది సిగ్గు చేటు"
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
కాంగ్రెస్ మాత్రం బీజేపీపై ఎదురుదాడికి దిగుతోంది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మాట్లాడకుండా మైక్ ఆఫ్ చేస్తున్న మాట వాస్తవమే అని తేల్చి చెబుతోంది. అదానీ అంశాన్ని ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకే బీజేపీ రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శిస్తోంది. ఇప్పటికే ఓ సారి రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. భారత దేశ వ్యతిరేక శక్తుల్లో రాహుల్ గాంధీ కూడా ఒకరు అంటూ తీవ్రంగా విమర్శించారు. యాంటీ ఇండియా "టూల్‌కిట్"లో రాహుల్ చేరిపోయారని ఆరోపించారు.
"రాహుల్ గాంధీ భారత్‌ను కించపరిచారు. పార్లమెంట్‌ను కూడా అవమానించారు. పరాయి దేశంలో మన దేశ పరువు తీశారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే వారితో చేతులు కలిపారు"
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ భారత్‌పై, మోదీ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్‌ను కించపరిచారంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. ఇటీవలే ఆ పర్యటన ముగించి వచ్చిన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మోదీ హయాంలో నిజంగా ప్రజాస్వామ్యమనేదే ఉంటే...కచ్చితంగా తనకు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో గౌతమ్ అదాని, ప్రధాని మధ్య రిలేషన్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తాను పార్లమెంట్‌లోకి వచ్చిన మరు నిముషమే సభను వాయిదా వేస్తారని విమర్శించారు.
Also Read: Wipro Layoffs: ఈ సారి విప్రో వంతు, ఒకేసారి 120 మందిని తొలగించిన కంపెనీ