Punjab Internet Ban: 


అన్ని చోట్లా అలెర్ట్..


పరారీలో ఉన్న ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పంజాబ్ పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు చోట్ల ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టిన వెంటనే అక్కడ ఇంటర్నెట్‌ను ఆపేశారు. అయితే...ఇప్పుడు ఈ ఆంక్షల్ని పొడిగించారు. రేపటి(మార్చి 20) వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ ఇంటర్నెట్‌తో పాటు SMS సర్వీస్‌లపైనా ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.