BJP Leader Daughter Marrying Muslim:



ఉత్తరాఖండ్‌ బీజేపీ లీడర్..


దేశవ్యాప్తంగా  The Kerala Story సినిమాపై ఎంత వివాదం జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. హిందూ అమ్మాయిలు కొందరి వలలో పడి ముస్లింలను పెళ్లి చేసుకోవడం, వాళ్లే మళ్లీ ఐసిస్‌లో చేరడం...ఇదీ కథ. లవ్‌ జిహాద్ (Love Jihad) కాన్సెప్ట్‌తో తెరకెక్కిందీ మూవీ. ఈ సినిమాను బీజేపీ సపోర్ట్ చేస్తుండగా...విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బీజేపీ నేత కూతురు...ముస్లిమ్‌ని పెళ్లాడుతున్నట్టు ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరాఖండ్‌కి చెందిన బీజేపీ లీడర్ యశ్‌పాల్ బేనం (Yashpal Benam) కూతురు ముస్లింని వివాహం చేసుకుంటున్నారని తెలిసింది. ఇక అప్పటి నుంచి ఆయనను టార్గెట్‌ చేసుకుని సోషల్ మీడియాలో కౌంటర్‌లు వేస్తున్నారు. ఆయనను సపోర్ట్ చేస్తూ కొందరు..వ్యతిరేకిస్తూ ఇంకొందరు తెగ పోస్ట్‌లు పెడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన యశ్‌పాల్‌...బీజేపీ పరువు తీస్తున్నారంటూ కొందరు మండి పడుతున్నారు. ఇంకొందరైతే "ఈ రెండు నాల్కల ధోరణి ఎందుకు" అని ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా లవ్ జీహాదే అని తేల్చి చెబుతున్నారు. కేరళ స్టోరీ సినిమాతో పోల్చుతున్నారు. ఫేస్‌బుక్‌లో దీనిపై పెద్ద డిబేట్ జరుగుతోంది.  "బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేరళ స్టోరీ సినిమాపై ట్యాక్స్ ఎత్తేస్తున్నాయి. కానీ...ఇక్కడ మాత్రం ఓ బీజేపీ నేత కూతురు ముస్లింని పెళ్లాడుతోంది. ఇలాంటి రెండు నాల్కల ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఓ ఫేస్‌బుక్ యూజర్ కామెంట్ చేశాడు. అయితే...దీనిపై పౌరి టెంపుల్ కమిటీ స్పందించింది. 


"ఇది కచ్చితంగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను వేరే మతానికి చెందిన అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేయడాన్నీ ప్రచారంగా ఫీల్ అయిపోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మత మార్పిడి చట్టాల్లో మార్పులొస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో మినార్‌ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. కానీ...కొందరు బీజేపీ నేతలు మాత్రం..ఇంకా ముస్లింలకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్‌తో పాటు బజ్‌రంగ్ దళ్‌ దీనిపై కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తం చేయాలి. బీజేపీ పార్టీ ఉన్నదే హిందువులను రక్షించుకోడానికి. ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పని చేసే వాళ్లను వెంటనే పార్టీ నుంచి తొలగించాలి"


- ఆలయ కమిటీ 


పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. The Kerala Storyపై ఆ ప్రభుత్వం బ్యాన్ విధించడాన్ని తప్పుబట్టింది. ఆ ఆదేశాలపై స్టే విధించింది. ప్రజల అసహనానికి అనుగుణంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేమని తేల్చి చెప్పింది. కేరళ హైకోర్టులోనే దీనిపై పిటిషన్‌ దాఖలైంది. కానీ...ఆ కోర్టు స్టే విధించేందుకు అంగీకరించలేదు. అక్కడి నుంచి పిటిషనర్‌లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం...నిషేధం విధించడానికి వీల్లేదని వెల్లడించింది. 


 "సీబీఎఫ్‌సీ కేరళ స్టోరీ సినిమాకు సర్టిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ఏమైనా అల్లర్లు జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా అయితే ఏదో ఓ కారణం అడ్డం పెట్టుకుని అన్ని సినిమాలనూ బ్యాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఫిల్మ్ మేకర్స్‌కి కూడా మేం చెప్పేదొకటే. సినిమాకు ముందు ఓ డిస్‌క్లెయిమర్ వేయండి. మీరు చెబుతున్న ఆ 32 వేల సంఖ్య కేవలం ఊహాజనితమని, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక డేటా లేదని చెప్పండి"


- సుప్రీంకోర్టు 


 Also Read: Karnataka Cabinet: కర్ణాటక కాంగ్రెస్‌కి మరో సవాలు, కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు!