ఫ్లోర్‌టెస్ట్‌లో విజయం..


బిహార్‌లో నితీష్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. ఆయన నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ ఏకగ్రీవంగా విజయం సాధించింది. ఈ సమయంలో భాజపా నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో ఆర్‌జేడీ నేతలపై సీబీఐ, ఈడీ దాడుల గందరగోళం సాగుతుండగానే...సభ జరిగింది. ఈ ఫ్లోర్‌ టెస్ట్‌లో నితీష్ గెలుస్తారా లేదా అన్న అనుమానాలు మొత్తానికి తొలగిపోయాయి. సమాజంలో అశాంతిని, అలజడిని సృష్టించడమే భాజపా పని అని బిహార్ సీఎం నితీష్ విమర్శించారు. బిహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సభలో స్పష్టం చేశారు. కొందరు భాజపా నేతలు వాకౌట్ చేయటంపైనా నితీష్ స్పందించారు. "నాకు వ్యతిరేకంగా పని చేస్తే తప్ప భాజపా నేతలకు మంచి పదవులు రావు. నన్ను టార్గెట్ చేయాలని బహుశా మీ బాస్‌ల నుంచి ఆర్డర్స్ వచ్చాయనుకుంటా" అని వ్యాఖ్యానించారు. 






సీబీఐ దాడులు, సోదాలు..


భాజపాయేతర రాష్ట్రాల్లో సీబీఐ దాడులు, సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న పశ్చిమబెంగాల్, తరవాత ఢిల్లీ. ప్రస్తుతం బిహార్. ఫ్లోర్‌ టెస్ట్‌కు సిద్ధమైన తరుణంలో ఆర్‌జేడీ, జేడీయూలకు షాక్ ఇచ్చింది CBI.పాట్నా, మధుబని ప్రాంతాల్లోని ఆర్‌జేడీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. "Land For Jobs"స్కామ్‌ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ కుంభకోణం జరిగింది. ఆర్‌జేడీ ట్రెజరర్, ఎమ్‌ఎల్‌సీ సునీల్ సింగ్ ఇంట్లో ఇప్పటికే సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు ఇద్దరు RJD రాజ్యసభ ఎంపీలు ఫయాజ్ అహ్మద్, అశ్ఫాక్ కరీమ్ ఇళ్లలోనూ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఆర్‌జేడీ మాజీ ఎమ్‌ఎల్‌సీ సుబోధ్ రాయ్‌ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. అయితే...వారి పూర్తి వివరాలు మాత్రం సీబీఐ వెల్లడించలేదు. అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునే ముందే CBI ఇలా సోదాలు చేయటం సంచలనమవుతోంది. 


ఆ స్కామ్‌ కేసులో భాగంగా..


గత నెల సీబీఐ భోళా యాదవ్‌ను అరెస్ట్ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భోళా యాదవ్ OSDగా వ్యవహరించారు. ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు లాలూ కుటుంబ సభ్యులు కొందరి దగ్గర నుంచి భూములను తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మేలో ఈ కేసులో భాగంగానే లాలూతో పాటు ఆయన కుటుంబంపైనా అవినీతి కేసు నమోదు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యలు ఇళ్లలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. లాలూ కూతురు మీసా భారతి ఇల్లు సహా మొత్తం 17 చోట్లు సోదాలు కొనసాగాయి. దాదాపు 12 మంది లాలూ ఇలా అక్రమంగా గ్రూప్‌ D ఉద్యోగాలు పొందారని అంటోంది CBI.ఈ ఉద్యోగాలు ఇచ్చినందుకు లాలూ యాదవ్ బిహార్‌లో మొత్తం 7 ప్లాట్లు లంచంగా తీసుకున్నారని, ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మంది
కుటుంబ సభ్యుల పేరుమీద ఈ ప్లాట్‌లున్నాయని చెబుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, కూతుళ్లు మీసా భారతి, హేమా యాదవ్‌తో పాటు మొత్తం 16 మంది పేర్లను FIRలో చేర్చింది CBI. గతేడాది సెప్టెంబర్‌లో ప్రాథమిక విచారణకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. లాలూ...IRCTC హోటల్స్ విషయంలో ఓ కంపెనీకి ఫేవర్‌గా పని చేశారని CBI తెలిపింది. 



Also Read: Liger First Review: 'లైగర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?


Also Read: Jaiveer Shergill Resigns: కాంగ్రెస్‌కు మరో షాక్, జాతీయ ప్రతినిధి రాజీనామా - బాధగా ఉందంటూ సోనియాకు లేఖ