పెళ్లిల్లు, పండగల సీజన్ వచ్చేసింది. అమ్మాయిలు మీరు మరింత అందంగా, అందరిలోనూ ప్రత్యేకంగా  కనిపించేందుకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ టైం వెస్ట్ చేసుకుంటున్నారా. మెరిసే చర్మం కోసం తాపత్రయ పడుతూ ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారా? అయితే కొద్దిగా ఆగండి మీ ఇంట్లో ఉండే వాటితోనే ఖర్చు లేకుండా అందమైన కాంతివంతమైన చర్మం పొందేందుకు ప్రయత్నించండి. ఇంట్లో దొరికే వాటితోనే మీరు మరింత అందంగా తయారై సంథింగ్ స్పెషల్ గా కనిపించవచ్చు. అందుకోసం మీ ఆహారపు అలవాట్లు కొద్దిగా మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మీ డైట్ లో చర్మ సంరక్షణ కోసం ఈ ఆహార పదార్థాలను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తే సరిపోతుంది.


మెరిసే చర్మం కావాలంటే కచ్చితంగా ఆరోగ్యకరమైన, పోషక విలువలు ఉండే మంచి ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ఆరోగ్యమే కాదు మెరిసే చర్మం కూడా మీ సొంతం అవుతుంది.


అవకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు చర్మం మెరుస్తూ ఉండేలా సహాయపడుతుంది.


వాల్ నట్స్: శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఇది మంచి ఎంపిక. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటడం వల్ల చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది.


పొద్దుతిరుగుడు విత్తనాలు: నట్స్, విత్తనాలు చర్మానికి చాలా పోషకాలు అందిస్తాయి. ఇందులో విటమిన్ ఇ, సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉంటాయి.


బ్రకోలి: చర్మ సంరక్షణకు అద్భుతమైన కూరగాయ ఇది. ఇందులో విటమిన్ ఎ, సి, జింక్ ఎక్కువగా ఉంటాయి. బీటా కెరొటిన్ లాగా పనిచేసే ల్యూటిన్ ఇందులో లభిస్తుంది.


టొమాటో: టొమాటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. లైకోపిన్ వంటి అనేక రకాల కెరొటీనాయుడ్ లు ఎక్కువగా ఉంటాయి.


మెరిసే ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఇంటి చిట్కాలు


కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. చర్మం మృదువుగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో కూడా కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది.


కలబంద: కలబందలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కణాల పెరుగుదలను ఇది ప్రోత్సహిస్తుంది. ఇది ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. మొటిమల వల్ల వచ్చే నల్ల మచ్చలను తగ్గించుకునేందుకు కూడా కలబంద గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మానికి మరింత అందాన్ని ఇస్తుంది.


నీరు తాగాలి: శరీరానికి నీరు చాలా అవసరం. నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే చర్మం అంత ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. శరీరాన్ని డీ హైడ్రేట్ నుంచి రక్షిస్తుంది.


సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి: హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన చర్మ కాంతి కోసం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ పోషకాలతో నించిన ఆహారాన్ని తీసుకుంటే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.


Also Read: పిల్లలకి జలుబు చేసిందని నెబులైజర్ పెడుతున్నారా? అయితే జర జాగ్రత్త


Also read: అరటి పండ్లను రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యమో తెలుసా?