చల్లని వాతావరణంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి త్వరగా ప్రబలే అవకాశం ఎక్కువ. వారికి జలుబు, జ్వరం వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ త్వరగా తగ్గిపోయేలాగా మందులు వాడాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి జలుబు చేసిన వెంటనే యాంటీ బయాటిక్స్ వాడటం, నెబులైజర్ పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే అలా చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.


పిల్లల్లో జలుబు చాలా సాధారణంగా కాలానుగుణంగా వస్తుంది. ముక్కు కరడం, ముక్కు మూసుకుని పోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు కనిపిస్తూ ఉంటాయి. జాలుబుకు కారణమయ్యే వైరస్ లను తట్టుకునే రోగ నిరోధక శక్తి పిల్లల్లో తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు త్వరగా దాని బారిన పడతారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కొలుకోవడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


అధికంగా యాంటీ బయాటిక్స్ వాడకం వద్దు


జ్వరం ఉంటే పారాసెటమాల్‌ వెయ్యాలి. ఇది గొంతు నొప్పికి కూడా సహాయపడుతుంది. అవసరమైతే పెద్ద పిల్లలు OTC యాంటీ-అలెర్జీ మందులను ఉపయోగించవచ్చు. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు OTC దగ్గు మరియు జలుబు మందులు డాక్టర్ సిఫార్సు లేకుండా అసలు ఉపయోగించకూడదు. డయాబెటిక్ మందులు వెంటనే వెయ్యడం చెయ్యకూడదు. వైద్యులని సంప్రదించకుండా అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పిల్లల్లో సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. 


నెబులైజర్ బదులు ఆవిరి పట్టాలి 


జలుబు వల్ల ముక్కు బిగుసుకుని ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే వెంటనే నెబులైజర్ పెట్టేస్తారు చాలా మంది తల్లిదండ్రులు. అయితే అలా చెయ్యకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెలైన్ నోస్ స్ప్రే మాత్రమే వినియోగించాలని అంటున్నారు. పిల్లలకి ఆవిరి పీల్చడం అలవాటు చెయ్యాలి. గోరువెచ్చని నీటితో పిల్లవాడికి ఆవిరి పట్టొచ్చు. అయితే ఇందులో ఎటువంటి మందులు కలపాల్సిన అవసరం లేదు. ఆవిరి తర్వాత పిల్లలను కొద్ది సేపు గది నుంచి బయటకి రాకుండా చూసుకోవాలి. ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ నుంచి త్వరిత ఉపశమనం లభించేలా చేస్తుంది. ఇలా స్ట్రీమ్ ఇన్ హెలేషన్ చెయ్యడం వల్ల పిల్లలకి హాయిగా అనిపిస్తుంది. విపరీతమైన దగ్గు వచ్చిన సమయంలో మాత్రమే నెబులైజర్ పెట్టాలి. అది కూడా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే దాన్ని ఉపయోగించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇవే కాదు ఇంట్లో దొరికే వాటితో చిన్న చిన్న చిట్కాలు పాటించి కూడా జలుబు త్వరగా తగ్గేలాగా చూసుకోవచ్చు, గోరు వెచ్చని నీటిని తాగించాలి. అలా చెయ్యడం వల్ల ఛాతిలో ఏర్పడిన బ్లాక్స్ క్లియర్ అవుతాయి. గొంతుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తుంది. వెల్లుల్లి, ఆవ నూనె కలిపి బాగా మరిగించి చల్లారిన తర్వాత దాన్ని పిల్లల శరీరం మొత్తం పట్టించి మసాజ్ చెయ్యాలి. ఇలా చేస్తే శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల పిల్లల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఈ చిట్కాలు పాటించి జలుబు నుంచి పిల్లల్ని రక్షించుకోవచ్చు.


Also read: మనుషులను వేటాడే చివరి గిరిజన తెగ, ఆ తెగ నాయకుడికి అరవై మంది భార్యలు


Also read: మగవారు మధ్యలోనే ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి ముఖ్య కారణాలు ఇవే