'మాన్‌స్టర్' (Monster Telugu Movie) టైటిల్‌తో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) కథానాయకుడిగా యువ దర్శకుడు పవన్ సాధినేని ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. పూజా కార్యక్రమాలతో మంగళవారం లాంఛనంగా ప్రారంభమైంది. సినిమాకు కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన కాసేపటికి... 'మాన్‌స్టర్' టైటిల్‌తో మరో సినిమా కబురు వచ్చింది. దాంతో ఈ టైటిల్ ఎవరిది? అనే చర్చ మొదలైంది. 'మాన్‌స్టర్' టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
రాజశేఖర్ సినిమా కంటే ముందు 'మాన్‌స్టర్' టైటిల్‌తో 'హ్యాపీ డేస్' వంశీ చాగంటి (Vamsee Chaganti) సినిమా స్టార్ట్ చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రియదర్శి, కళ్యాణ్ ఎర్రా, కౌటిల్య, అశోక్ కుమార్, 'శుభలేఖ' సుధాకర్, కడలి సత్యనారాయణ, కిరీటి దామరాజు... ఇలా భారీ తారాగణంతో వేద్ ఐతరాజు దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. పద్మా ఇరువంటితో కలిసి వంశీ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
టైటిల్ రిజిస్టర్ చేయించిన వంశీ!
రెండు సినిమాలకు ఒకటే టైటిల్ ఉండటంతో ఇటు మీడియాలో, అటు సినిమా ఇండస్ట్రీలో అసలు టైటిల్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. రాజశేఖర్ (RS92 Movie) యూనిట్ కంటే ముందు వంశీ చాగంటి 'మాన్‌స్టర్' టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. రైట్స్ ఆయన దగ్గరే ఉన్నాయి. ఈ విషయం తెలియక RS 92 దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత మల్కాపురం శివకుమార్ టైటిల్ అనౌన్స్ చేసినట్లు ఉన్నారు. తర్వాత రిజిస్టర్ చేయించుకోవచ్చనే ఉద్దేశంతో! అదీ సంగతి!
'హ్యాపీ డేస్' తర్వాత వంశీ చాగంటి కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత విరామం తీసుకున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్', రవితేజ 'క్రాక్' తదితర సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. ఇప్పుడీ 'మాన్‌స్టర్'తో మళ్ళీ ఆయన ప్రధాన పాత్రల వైపు అడుగులు వేశారు. కథపై నమ్మకంతో ఆయన నిర్మాతగా కూడా మారారు.
Also Read : అన్‌స్టాపబుల్ - రెండో సీజన్ ఎప్పట్నించి స్టార్ట్ అవుతుందంటే?
గతంలో ఈ విధంగా కొన్ని టైటిల్స్ వివాదాల్లో చిక్కుకున్నాయి. అయితే, అప్పట్లో ఛాంబర్ ఆ సమస్యలను పరిష్కరించింది. ముందు ఎవరు టైటిల్ రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళకు రైట్స్ ఉంటాయి. సో... ఆ లెక్కన చూస్తే 'మాన్‌స్టర్' టైటిల్ వంశీదే. రాజశేఖర్ టీమ్ ఆ టైటిల్ వదులుకోవాలి. లేదంటే ఆ టైటిల్ ముందు మరో పేరు ఏదైనా యాడ్ చేసుకోవాలి. టైటిల్ విషయాన్ని రాజశేఖర్ చిత్ర బృందం దృష్టికి తీసుకు వెళ్ళడానికి వంశీ చాగంటి అండ్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?