CBI Raids Tejaswi Yadav Mall: 


గుడ్‌గావ్‌లోని మాల్‌లో సోదాలు


బిహార్‌లో పలువురు RJD నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు చెందిన గుడ్‌గావ్‌లోని అర్బన్ క్యూబ్స్ మాల్‌లోనూ సోదాలు నిర్వహిస్తోంది. Land For Jobs స్కామ్‌లో భాగంగా ఈ రెయిడ్స్ చేస్తోంది. ఇప్పటికే ఈ సోదాలతో రాజకీయం వేడెక్కగా...మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశమైంది. అంతకు ముందే మహాఘట్‌బంధన్ కూటమి ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే...విజయ్ కుమార్..ఈ అవిశ్వాస తీర్మానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని వెల్లడించారు. ఇప్పుడు ఏకంగా స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. 


ఆ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా..


పాట్నా, మధుబని ప్రాంతాల్లోని ఆర్‌జేడీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. "Land For Jobs"స్కామ్‌ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ కుంభకోణం జరిగింది. ఆర్‌జేడీ ట్రెజరర్, ఎమ్‌ఎల్‌సీ సునీల్ సింగ్ ఇంట్లో ఇప్పటికే సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు ఇద్దరు RJD రాజ్యసభ ఎంపీలు ఫయాజ్ అహ్మద్, అశ్ఫాక్ కరీమ్ ఇళ్లలోనూ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఆర్‌జేడీ మాజీ ఎమ్‌ఎల్‌సీ సుబోధ్ రాయ్‌ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. అయితే...వారి పూర్తి వివరాలు మాత్రం సీబీఐ వెల్లడించలేదు. అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునే ముందే CBI ఇలా సోదాలు చేయటం సంచలనమవుతోంది. 


గతేడాది నుంచే ప్రాథమిక విచారణ..


గత నెల సీబీఐ భోళా యాదవ్‌ను అరెస్ట్ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భోళా యాదవ్ OSDగా వ్యవహరించారు. ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు లాలూ కుటుంబ సభ్యులు కొందరి దగ్గర నుంచి భూములను తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మేలో ఈ కేసులో భాగంగానే లాలూతో పాటు ఆయన కుటుంబంపైనా అవినీతి కేసు నమోదు చేసింది. 
లూలూ ప్రసాద్ యాదవ్‌ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇళ్లలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. లాలూ కూతురు మీసా భారతి ఇల్లు సహా మొత్తం 17 చోట్లు సోదాలు కొనసాగాయి. దాదాపు 12 మంది లాలూ ఇలా అక్రమంగా గ్రూప్‌ D ఉద్యోగాలు పొందారని అంటోంది CBI.ఈ ఉద్యోగాలు ఇచ్చినందుకు లాలూ యాదవ్ బిహార్‌లో మొత్తం 7 ప్లాట్లు లంచంగా తీసుకున్నారని, ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మంది
కుటుంబ సభ్యుల పేరుమీద ఈ ప్లాట్‌లున్నాయని చెబుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, కూతుళ్లు మీసా భారతి, హేమా యాదవ్‌తో పాటు మొత్తం 16 మంది పేర్లను FIRలో చేర్చింది CBI. గతేడాది సెప్టెంబర్‌లో ప్రాథమిక విచారణకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. లాలూ...IRCTC హోటల్స్ విషయంలో ఓ కంపెనీకి ఫేవర్‌గా పని చేశారని CBI తెలిపింది. 


Also Read: Breaking News Live Telugu Updates: పోలీసుల నోటీస్‌పై కోర్టుకెళ్లిన బండి సంజయ్- పాదయాత్రకు అనుమతివ్వాలని కోర్టులో పిటిషన్