అమ్మని నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావా మామ్ చేసింది తప్పుగా అనిపించడం లేదా అని అభి అనసూయని అడుగుతాడు. ప్రేమ్ మాత్రం తల్లిని వెనకేసుకొస్తాడు. వాడేవాడో క్యాజువల్ గా ఆర్టికల్ రాశాడు, ఆంటీ ఫోటో వేశాడు దానికి ఆంటీని తప్పు పట్టడానికి ఏముందని అభిని ప్రశ్నిస్తుంది శ్రుతి. తులసిని వైజాగ్ పంపించి తప్పు చేశాను అని అనసూయ మనసులో అనుకుంటుంది. దివ్య కూడా తల్లికి సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఒకప్పుడు మేము, మీ నాన్న మీ అమ్మ పట్ల ఇలాగే కఠినంగా ప్రవర్తించాము. ఇన్నాళ్ళకు గాని తనకి స్వేచ్చ దొరకలేదు సంతోషంగా ఉండనివ్వు, ఇలా గొడవ చేసి మళ్ళీ మీ అమ్మ కాళ్ళకి సంకెళ్ళు వేసి బంధించకు.. ఏమంటావు అనసూయ అని పరంధామయ్య అడుగుతాడు. వాడి ఉద్దేశం కూడా అర్థం చేసుకోండి ఎవరి మీదైన విషం కక్కాలంటే సమాజం ముందు ఉంటుంది. అది నిజమా అబద్ధమా అని ఆలోచించదు, అలాంటి సమాజానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని అభి ఉద్దేశం అని అనసూయ అనేసరికి అందరూ షాక్ అవుతారు.


నేను తులసిని నిందించడం లేదు తనకి సంకెళ్ళు వేయాలని అనుకోవడం లేదని అంటోంది. ఆ మాటకి దివ్య నీ మాటల్లో క్లారిటీ లేదు నానమ్మ కన్ఫూజన్ లో మాట్లాడుతున్నావని అంటుంది. అవును నేను నిజంగానే అయోమయంలో ఉన్నాను అని అనసూయ అనుకుంటుంది. దీని గురించి తులసితో ఎవరు మాట్లాడటానికి వీల్లేదని పరంధామయ్య ఆజ్ఞాపిస్తాడు. అప్పుడే తులసి వస్తుంది ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారని అడుగుతుంది. ఏమి లేదని పరంధామయ్య కవర్ చేస్తాడు. ఇక అక్కడికి సామ్రాట్ కూడా వస్తాడు. అతన్ని చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. వీడు కూడా ఇదే టైం కి రావాలా అని పరంధామయ్య మనసులో అనుకుంటాడు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని సామ్రాట్ అంటాడు. మా ఇంట్లో ఏ విషయంలోను దాపరికాలు ఉండవు ఏం మాట్లాడాలన్నా అందరి ముందు మాట్లాడండి మా మామ్ కూడా ఏమనుకోదని అభి కోపంగా అంటాడు.


Also Read: యష్ ని ఘోరంగా అవమానించిన కొడుకు ఆదిత్య- తల్లడిల్లిన తండ్రి మనసు


సామ్రాట్ సోషల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ తులసికి చూపిస్తాడు.  నా వల్లే ఇలా జరిగింది, నా వల్లే మీకు బ్యాడ్ నేమ్, మీ మనసు ఎంత బాధపడి ఉంటుందో నేను ఊహించగలను ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని టెన్షన్ గా చెప్తాడు. సామ్రాట్ గారు మీరు దీన్ని నిజంగా సీరియస్ గా తీసుకుంటున్నారా అని తులసి అడుగుతుంది. నేను అయితే అస్సలు పట్టించుకోను అనేసరికి అభి, అనసూయ షాక్ అయితే మిగతా వాళ్ళు మాత్రం సంతోషిస్తారు. ‘ఏదైనా సరే చూసే చూపులో ఆలోచించే మనసులో ఉంటుంది, ఒకప్పుడు నేను ఇలాంటి వాటికి భయపడేదాన్ని ఇప్పుడు కాదు నా వరకు నా జీవితం నా కుటుంబమే నాకు ముఖ్యం నా వాళ్ళకు నా మీద నమ్మకం ఉన్నంత వరకు నేను ఇలాంటివి అస్సలు పట్టించుకోను మీరు పట్టించుకోవద్దు’ అని తులసి చెప్తుంది. వావ్ నా దృష్టిలో మీరు ఇంకో నాలుగు మెట్లు ఎక్కారు అని పొగడ్తలు మొదలు పెట్టేస్తాడు. ఇక అందరి డౌట్లు తిరిపోయాయి కదా ఇంక దీని గురించి ఎవరు మాట్లాడొద్దని పరంధామయ్య మరోసారి హెచ్చరిస్తాడు.


అనసూయ మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయట వాళ్ళు మాట్లాడుకుంటుంటే చూస్తూ ఉంటుంది. సామ్రాట్ తులసితో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ తనలో తానే నవ్వుకుంటాడు. ఆ నవ్వుకు అర్థం ఎంతో, నవ్వు వెనక కరణం ఎంతో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అబ్బాయ్ అని సామ్రాట్ బాబాయ్ అడుగుతాడు. వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు కనిపిస్తుందని అంటాడు. నువ్వు అనుకుంటుంది, ఊహిస్తుంది నూటికి నూరు పాళ్ళు నిజం అని సామ్రాట్ అంటాడు. నాలో ఈ మార్పుకి కారణం తులసిగారు అని అంటాడు. అనసూయ, పరంధామయ్య కూర్చుని తులసిని చూస్తూ ఉంటారు. తులసి మీద అనుమానపడుతున్నావా అని అడుగుతాడు. కాదు సామ్రాట్ మీద, తన ప్రవర్తన మీద అనుమానమని చెప్తుంది. మనసులో ఏముందో సూటిగా చెప్పమని అడుగుతాడు. తులసికి తన జీవితం మీద కంట్రోల్ ఉంది కాదు అనను ఒక బలహీనమైన ఆలోచన క్షణం చాలు మనసు దారి తప్పడానికి అని అనసూయ మనసులో విషయం బయట పెట్టేస్తుంది. నీ కొడుకు నీ మనసులో నాటి వెళ్ళిన విషబీజం అని పరంధామయ్య అంటాడు. వాడి మాటలు విని తులసికి అన్యాయం చేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతాడు. కాదు మన కోడలు చుట్టూ లక్ష్మణ రేఖ గీయాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ పరంధామయ్య మాత్రం తులసిని వెనకేసుకోస్తూ మాట్లాడతాడు.


Also Read: తులసి, సామ్రాట్ గురించి నీచంగా ఆర్టికల్- రచ్చ చేసిన అభి, అనసూయ బుర్రలో విషం నింపిన నందు, లాస్య


తరువాయి భాగంలో..


పరంధామయ్య తులసికి ఫోన్ చేసి నేను సామ్రాట్ ఇంట్లో ఉన్నానని కోపంగా చెప్తాడు. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని తులసి భయంగా అడుగుతుంది. చేయాల్సినదంతా చేసి అమాయకురాలిగా మాట్లాడతావా, ఎవ్వరికీ చెప్పకుండా వెంటనే సామ్రాట్ ఇంటికి వచ్చేయ్ అని చెప్తాడు. తులసి ఉరుకులు పరుగుల మీద సామ్రాట్ ఇంటికి వస్తుంది.