Edible Oil Rates : నిత్యావసర వస్తువుల ధరలతో బడ్జెట్ తలకిందులు అయిపోతున్న సామాన్యుడికి కాస్త రిలీఫ్ లభించనుంది. లీటర్‌కు రూ. పదిహేను వరకూ తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు దిగి వస్తుండడంతో దేశీయంగానూ ఈ నూనెల ధరలు తగ్గుతున్నాయి. సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గాయని ఇండియన్ వెజిటేబుల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేర్కొంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంట నూనెల ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి.
సమోసా తింటే బిల్లు కట్టక్కర్లేదు పైగా రూ. 51 వేలిస్తారు - ట్రై చేస్తారా ?
దేశీయంగా వంట నూనెల గరిష్ట రిటైల్ ధర ( MRP )ని లీటర్ కు రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఆదేశించింది. శుక్రవారం రోజున తయారీదారులు, రిఫైనలరీలకు, పంపిణీదారులు తగ్గించిన ధరను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మే, 2022లో చివరి సారిగా వంటనూనెల ధరలను తగ్గించారు. ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ పై సుంకాలను తగ్గించిన నేపథ్యంలో వాటి పూర్తి ప్రయోజనం వినియోగదారులకు అందించాలని కేంద్రం భావిస్తోంది.
ఆమ్నెస్టీకి రూ. 50 కోట్ల ఫైన్ - షాకిచ్చిన ఈడీ !
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు అనూహ్యంగా పతనం అవుతున్నాయి. అయితే ధరలు తగ్గుతున్నా దేశీయ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో వంట నూనెల టన్ను ధర 300-450 డాలర్లకు తగ్గింది. దీంతో రానున్న రోజుల్లో రిటైల్ ధరలెు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర తగ్గింపు ప్రయోజనాలు దేశీ మార్కెట్‌లో రిటైల్ ధరల్లో కనిపించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
"ఒరేయ్ రాములయ్య " క్యారెక్టర్ ఉంటే ఆ బీహార్ తండ్రిలాగే ఉండొచ్చు - ఏం చేశాడంటే ?
గత నెలలో పలు ఆయిల్ తయారీ కంపెనీలు ధరలను లీటరుకు రూ. 10 నుంచి రూ. 15 వరకు తగ్గించాయి. కాగా ఈరోజు జరిగే మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటే.. దాని వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల సామాన్యులకు ధరల పంపు నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది.