Bharat Jodo Yatra: 'భారత్‌ జోడో యాత్ర' రాజస్థాన్‌లో ఉత్సాహంగా సాగుతోంది. కీలక నేతలు, వందలాది మంది కార్యకర్తలతో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. భాజపా కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చారు.


లవ్


మంగళవారం ఉదయం ఝలావార్‌లో యాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ.. భాజపా కార్యాలయం మీదుగా వెళ్లారు. ఆ సమయంలో కార్యాలయంపైన ఉన్న భాజపా కార్యకర్తలకు ఫ్లైయింగ్‌ కిస్సెస్‌ ఇచ్చారు రాహుల్ గాంధీ. వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. రాహుల్‌ గాంధీ ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  






డ్యాన్స్


రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో పూర్తయి ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 17 రోజులు 500 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. అయితే ఈ సందర్భంగా రాజస్థాన్‌లో ఆసక్తికర పరిణామం జరిగింది. తమ వైరుధ్యాలను పక్కన పెట్టి రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), సచిన్ పైలట్ (Sachin Pilot).. కలిసి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. అంతేకాదు డ్యాన్స్ వేసి జోష్ నింపారు.






ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఒకే వేదికపైకి వచ్చారు. అంతేకాదు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి కాలు కదిపారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని గిరిజన నృత్యం చేశారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ (Kamal Nath) కూడా వేదికపైకి వచ్చి వీరితో చేయి కలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. దీంతో కాంగ్రెస్ అధి నాయకత్వం, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి దిగుతున్నారు. 


మహిళా మార్చ్


2023లో రెండు నెలల పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో 'మహిళా మార్చ్' ప్రారంభమవుతుందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆదివారం ప్రకటించారు. 2023 జనవరి 26, నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.


రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక పాద‌యాత్ర ప్రారంభ‌ం కానుంది. మ‌రోవైపు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఛత్తీస్‌గఢ్ రాజ‌ధాని రాయ్‌పుర్‌లో 85వ ప్లీన‌రీ స‌మావేశాల‌ను మూడు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ఆదివారం జ‌రిగిన పార్టీ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.


Also Read: Gujarat Polls: భాజపాకు కేజ్రీవాల్ షాకిస్తారా? గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు!