ABP  WhatsApp

Gujarat Polls: భాజపాకు కేజ్రీవాల్ షాకిస్తారా? గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు!

ABP Desam Updated at: 06 Dec 2022 02:30 PM (IST)
Edited By: Murali Krishna

Kejriwal On Congress Alliance: గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు.

భాజపాకు కేజ్రీవాల్ షాకిస్తారా? గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు!

NEXT PREV

Kejriwal On Congress Alliance: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలను అభినందిస్తూ, "ప్రజలు మరోసారి ఆప్‌పై విశ్వాసం చూపించారని, రేపు అదే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకునే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు.

వెయిట్

కాంగ్రెస్‌తో పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా "డిసెంబర్ 8 వరకు ఆగండి" అంటూ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో భాజపా రికార్డు స్థాయిలో విజయం సాధింస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం భాజపాను గద్దె దించి ఆప్‌ విజేతగా నిలుస్తుందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్.

తక్కువ అంచనా!

ఎగ్జిట్ పోల్స్‌పై అంతకుముందు ఆమ్‌ఆద్మీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు.

ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ AAP ఓటర్లను తక్కువగా అంచనా వేస్తున్నాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే భాజపా కార్యకర్తల గూండాయిజం కారణంగా వారు తమ అభిప్రాయాన్ని చెప్పలేక పోతున్నారు. MCD ఎన్నికలలో పార్టీ 200 సీట్లు దాటుతుంది. దేశ రాజధానిలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అభివృద్ధి పనుల ఆధారంగా ఆప్ ఓటర్లు ఓటు వేస్తున్నారని ఎగ్జిట్ పోల్స్ కూడా చూపిస్తున్నాయి.                                -  సౌరభ్ భరద్వాజ్, ఆమ్‌ఆద్మీ నేత

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

182 స్థానాలున్న గుజరాత్‌లో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. భాజపా 128-140 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి. కాంగ్రెస్ 31-43 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందన్నాయి. మరోవైపు ఆప్ 3-11 స్థానాలు మాత్రమే సాధిస్తుందని పేర్కొన్నాయి.
 
ALLIANCE WIN/LEADS
BJP 128-140
INC 31-43
AAP 3-11
OTH 2-6

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ భాజపా గెలిచే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్- సీ ఓటర్‌ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. 68 స్థానాల్లో మెజార్టీ సీట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. 

ABP న్యూస్-CVoter ఎగ్జిట్ పోల్ ప్రకారం భాజపా 33-41 సీట్లు సాధిస్తుందని అంచనా. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 44 స్థానాల కన్నా తక్కువగానే గెలిచే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 24-32 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 21 సీట్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ సర్వేలో తెలుస్తోంది.  ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సీఓవర్ ఎగ్జిట్ పోల్స్ చెబుతుంది. 

ALLIANCE WIN/LEADS
BJP 33-41
INC 24-32
AAP 00
OTH 0-4
Published at: 06 Dec 2022 02:23 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.