కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొంతకాలంగా రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో ఈ నెల 27న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సోమవారం ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు భారత్ బంద్ జరుగుతుంది. ఈ సమయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, ఇతర సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు దేశవ్యాప్తంగా మూసివేయబడతాయని తెలిపాయి. ఇప్పటికే టీడీపీ ఈ బంద్ కు మద్దతు ప్రకటించగా, తాజాగా వైసీపీ కూడా మద్దతు తెలిపింది. భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మంత్రి పేర్ని నాని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గతంలో గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై సీఎం జగన్ జగన్ తప్పుబట్టారు. ఇప్పుడు రైతులు అదే అంశంపై చేపడుతున్న భారత్ బంద్ కు వైసీపీ మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. అదే రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలకు వైసీపీ మద్దతు తెలిపింది. 


Also Read: ‘జగన్ గురించి మాట్లాడితే తాటతీస్తాం, పనికిమాలిన స్టార్‌..’ పవన్‌పై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు


ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫైర్


కాంగ్రెస్, వామపక్షాలు, రైతు సంఘాలు ఈనెల 27న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. తాజాగా వైసీపీ ప్రభుత్యం కూడా మద్దతు తెలిపింది. ఈ నిర్ణయంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గాడి తప్పిన ప్రభుత్వ పాలనను కప్పిపుచ్చుకోవడానికి భారత్ బంద్ కు మద్దతు ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అయోమయంగా ఉండడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలపై అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ రైతు సంక్షేమం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చారన్నారు. ఇందులో భాగంగానే రైతులు పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు. రైతులకు మేలు చేసే సంస్కరణలను స్వాగతించాల్సింది పోయి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 


Also Read: మంత్రివర్గం మార్పు సీఎం ఇష్టం... పవన్ నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడకు.... ఏపీ మంత్రి బొత్స హాట్ కామెంట్స్


మద్దతిస్తున్న పార్టీలు


రాష్ట్రపతి ఆమోదం పొందిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పోరాటం చేపట్టారు. ఈ బిల్లులను ఆమోదించి ఏడాది అవ్వడంతో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రధాన రాజకీయపార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బంద్‌కు మద్దతునివ్వగా, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్త సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా సోమవారం నిరసనల్లో పాల్గొంటుందని తెలిపింది. తాజాగా బ్యాంకర్స్ ఆఫీసర్స్ యూనియన్ కూడా భారత్ బంద్ కు మద్దతు తెలిపింది. 


Also Read: భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు - బస్సులు నిలిపివేయాలని నిర్ణయం!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి