Bengaluru Man Spotted Sleeping On Mattress In Middle of Road: ఈ రోడ్డేమైనా మీ బాబుదా అని ఎవరైనా అడిగారేమో కానీ.. యస్ మా బాబుదే అనుకున్న ఓ వ్యక్తి ఇంటికెళ్లి పరుపు తెచ్చుకుని రోడ్డు మీద వేసుకుని దాని మీద పడుకుని కాలు మీద కాలేసుకుని మరీ రిలాక్సయ్యాడు. అతడ్ని కదిలించలేక ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. 
  
బెంగళూరు ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పని లేదు. అసలు అంతంతమాత్రంగా ఉండే రోడ్ మీద కదలికలు ఈ వ్యక్తి దెబ్బకు పూర్తిగా ఆగిపోయాయి.  అజ్ఞాత వ్యక్ రోడ్డు  మధ్యలో మ్యాట్రస్ వేసుకుని కాలుపై కాలు వేసుకుని  రిలాక్స్‌గా పడుకుని ఉన్నాడు. చుట్టుపక్కల నుంచి వచ్చే వాహనాలు హార్న్  కొడుతూ ఆగిపోయాయి, కానీ అతను  పట్టించుకోకుండా  బిందాస్ గా గడిపాడు.   రోడ్డు మధ్యలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Continues below advertisement



ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు రెండు వైపులా జామ్ అయ్యాయి. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు, కానీ స్థానికులు పోలీసులు వచ్చి వ్యక్తిని తొలగించారని చెబుతున్నారు. 


సోషల్ మీడియాలో ఈ వీడియోకు వివిధ స్పందనలు వస్తున్నాయి. కొందరు "ఇది మానసిక సమస్యలు కారణంగా జరిగి ఉండవచ్చు" అంటూ సానుభూతి చూపుతున్నారు,  బెంగళూరు వంటి తలనాటి నగరాల్లో హోమ్‌లెస్ వ్యక్తులు, మద్యపానం, మానసిక ఆరోగ్య సమస్యలు వంటివి ఇలాంటి ఘటనలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.