Bellamkonda Sai Sreenivas Kishkindhapuri Success Meet: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు సుప్రీం హీరో సాయి దుర్గాతేజ్ అన్నారు. యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'కిష్కింధపురి' సక్సెస్ మీట్‌లో తాజాగా ఆయన మాట్లాడారు. ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'కిష్కింధపురి' టీంపై సాయి తేజ్ ప్రశంసలు కురిపించారు.

Continues below advertisement

మా మామయ్య మూవీ కోసం...

'కిష్కింధపురి' సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్‌గా భావిస్తున్నట్లు సాయి తేజ్ తెలిపారు. 'సాహు గారితో నాకు మంచి ఒక అనుబంధం ఉంది. 15 ఏళ్లుగా మా జర్నీ కొనసాగుతోంది. నా టెన్త్ క్లాసు మేట్ వశిష్ట, కనిష్క కూడా నా క్లాస్ మేట్. అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2015లో చిరంజీవితో సినిమా తీయడానికే ఇండస్ట్రీకి వచ్చానని అనిల్ చెప్పారు. పదేళ్ల తర్వాత ఆయనతో మూవీ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ సక్సెస్ మూమెంట్‌ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం.

Continues below advertisement

ఇండస్ట్రీ ఒక ఎవల్యూషన్ దశలో ఉంది. మంచి కథలు రావాలి. ఆడియన్స్‌ని ఎక్సైట్ చేసే కథలు రావాలి. అలాంటి సినిమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిస్కింధపురి.. ఇలా అన్ని సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. మంచి కంటెంట్‌ని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు.' అని చెప్పారు.

Also Read: దీపికా బయలుదేరమ్మా ఇక అని ఎందుకంటున్నారు? మొన్న స్పిరిట్, ఇప్పుడు కల్కి 2898 AD సీక్వెల్..మరి అట్లీ మూవీ?

అనుదీప్‌తో  అనిల్ మూవీ

హారర్ కామెడీ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చా అన్న ప్రశ్నకు డైరెక్టర్ అనిల్ రావిపూడి... అనుదీప్ డైరెక్టర్‌గా తాను హీరోగా హారర్ కామెడీ చేస్తానని చెప్పారు. 'కిష్కింధపురి సినిమా చూసి చాలా చోట్ల భయపడ్డాను. కొన్ని సీక్వెన్స్‌లో థియేటర్స్ మొత్తం షేక్ అయింది. ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్‌ఫుల్ సెప్టెంబర్ అయింది. కొత్తలోక, మిరాయ్, కిష్కిందపురి, లిటిల్ హార్ట్స్ సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. థియేటర్స్‌లో ఓ చిన్న ఫెస్టివల్‌లా ఉంది. ఈ మూమెంట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. కౌశిక్ అద్భుతంగా ఈ సినిమాను తీశారు. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.' అని చెప్పారు.

'కిష్కింధపురి' థియేటర్స్‌లోనే చూడాలి

ఈ సెప్టెంబర్ మంత్ థియేటర్స్‌కి చాలా బావుందని... అందరూ థియేటర్స్‌కి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. 'కిష్కింధపురి థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమాను చూసి సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి. ఇది మీ అందరిని అలరించే సినిమా. తేజ్‌తో నాది వెరీ లాంగ్ జర్నీ. మరింత సపోర్ట్ చేసే సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా.' అని చెప్పారు.

'కిష్కింధపురి' టీం మొత్తం అద్భుతంగా పని చేశారని... అందుకే ఇంత సక్సెస్ సాధించిందని డైరెక్టర్స్ బాబి, అనుదీప్ చెప్పారు. డైరెక్టర్ కౌశిక్ నుంచి ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 'కిష్కింధపురి' పార్ట్ 2 ఎప్పుడు? అని అందరూ అడుగుతున్నారని... దీనిపై ఐడియా ఉందని డెఫినిట్‌గా వస్తుందని చెప్పారు డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి. ఈ హిట్ మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ఎంతో ఎనర్జీ ఇచ్చిందని నిర్మాత సాహు గారపాటి తెలిపారు.