Prakash Raj As Satya Dada In Pawan OG Movie: వరల్డ్ వైడ్‌గా పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అవెయిటెడ్ మూవీ 'OG'. 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇప్పటికేే సోషల్ మీడియాలో సంబరాలు మొదలయ్యాయి. తాజాగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
పవర్ ఫుల్ రోల్‌లో...
ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో 'సత్య దాదా' అనే పాత్రలో ఆయన కనిపించనున్నట్లు వెల్లడించారు. కళ్ల జోడు పెట్టుకుని సీరియస్‌గా ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. మూవీలో ఆయన రోల్ చాలా కీలకం అని అర్ధమవుతోంది.
Also Read: ఫస్ట్ తలైవాతో మూవీ... ఆ నెక్స్ట్ ప్రభాస్ 'కల్కి 2898AD' సీక్వెల్ - నాగ్ అశ్విన్ ప్లాన్ అదేనా!
పొలిటికల్ ఎనిమీస్... ఒకే మూవీలో...
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తాను సైన్ చేసిన మూవీస్‌ను కంప్లీట్ చేస్తున్నారు. పొలిటికల్ పరంగా పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా విమర్శలు చేస్తూనే వచ్చారు. తిరుపతి లడ్డూ కల్తీ అంశం దగ్గర నుంచి సనాతన ధర్మం ఇలా అన్నింటినీలో పవన్ కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. పవన్ విధానాలకు తాను వ్యతిరేకం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఆయనతో కలిసి మూవీ చేయాల్సి వస్తే కచ్చితంగా చేస్తానని గతంలోనే చెప్పారు. పవన్ కూడా ప్రకాష్ రాజ్ కామెంట్స్‌కు కౌంటర్ ఇస్తూనే వచ్చారు.
ఇప్పుడు 'ఓజీ' మూవీలో ఇద్దరూ కలిసి కనిపించనుండడంతో ఫ్యాన్స్ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పొలిటికల్‌గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వీరు ఒకే మూవీలో పవర్ ఫుల్ రోల్స్‌లో నటించడంతో సస్పెన్స్ నెలకొంది. 'సత్య దాదా' రోల్ ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్ కోసం వెయిటింగ్
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, స్పెషల్ బీజీఎంలు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పవన్ గ్యాంగ్ స్టర్ 'ఓజాస్ గంభీర'గా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. వీరితో పాటే హరీష్ ఉత్తమన్, జగపతిబాబు, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ మూవీని నిర్మించారు.